Kerala HC : అత్యా‘ఆ’చారమా? ఆ హక్కు భర్తకు లేదు..: కేరళ హైకోర్టు

‘వైవాహిక అత్యాచారం’ నేరమనీ..భార్యకు ఇష్టం లేకుండా భర్త లైంగికంగా వేధిస్తే అది విడాకులు తీసుకోవటానికి కారణంగా పరిగణించబడుతుందని కేరళ హైకోర్టు వెల్లడించింది. ఇది వైవాహిక అత్యాచారంగా పరిగణించబడుతుందని వ్యాఖ్యానించింది. ఇటువంటి ప్రవర్తనకు చట్టపరంగా శిక్షించలేకపోయినా..అది భార్యను శారీరక, మానసికంగా హింసించినట్లేనని స్పష్టం చేసింది.

Kerala HC : అత్యా‘ఆ’చారమా? ఆ హక్కు భర్తకు లేదు..: కేరళ హైకోర్టు

Kerala High Court Upheld Marital Rape As A Solid Ground For Seeking A Divorce

Marital rape for Kerala High Court : ‘వైవాహిక అత్యాచారం’ అనే మాట సమాజం పరంగా చూసుకుంటే అదో పెద్ద విషయమా? అన్నట్లుగా ఉంటుంది.కానీ న్యాయస్థానం పరంగా చూస్తే అది నేరంగా పరిగణించబడుతోంది. భార్య భర్త సొత్తు..ఏదైనా చేస్తాడు..అనేది సమాజంలో కొంతమంది వాదన. కానీ ఆ భార్యకు కూడా మనస్సుంటుంది. ఇష్టాలు..అయిష్టాలు ఉంటాయి. వాటిని గౌరవించాలి అని న్యాయస్థానం చెబుతుంది. భర్త అయినంత మాత్రాన భార్యకు ఇష్టం లేకుండా లైంగిక క్రియలో పాల్గొనకూడదంటుంది న్యాయస్థానం. కానీ భర్త అనే అహం ఆ మాటల్ని బేఖాతరు చేస్తుంది. కట్టుకున్నవాడు ఏంచేసినా అది హక్కు అంటాడు. కానీ అది నేరం అంటుంది న్యాయస్థానం. అదే మరోసారి జరిగింది న్యాయస్థానంలో.

‘వైవాహిక అత్యాచారం’ అనేది నేరమనీ..భార్యకు ఇష్టం లేకుండా భర్త లైంగికంగా వేధిస్తే అది విడాకులు తీసుకోవటానికి కారణంగా పరిగణించబడుతుందని కేరళ హైకోర్టు వెల్లడించింది. కేరళకు చెందిన ఓ మహిళ.. వైవాహిక అత్యాచారాన్ని కారణంగా చూపుతూ తనకు విడాకులు ఇప్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. ‘భార్య స్వయంప్రతిపత్తిని విస్మరించి భర్త చేసిన లైంగిక సంపర్కం వైవాహిక అత్యాచారంగా పరిగణించబడుతుందని వ్యాఖ్యానించింది. ఇటువంటి ప్రవర్తనకు చట్టపరంగా శిక్షించలేకపోయినా..అది భార్యను శారీరక, మానసికంగా హింసించినట్లేనని స్పష్టం చేసింది.

వైవాహిక అత్యాచారాలను విడాకులకు సరైన కారణంగా పేర్కొంటూ.. జస్టిస్ ఏ మహమ్మద్ ముస్తాక్, జస్టిస్ కౌసర్ ఎడప్పాగత్ తో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘వైవాహిక అత్యాచారాలను చట్టం గుర్తించలేదనే కారణంతో.. కోర్టు గుర్తించకుండా ఉండదనీ..కాబట్టి విడాకాలు తీసుకోవటానికి వైవాహిక అత్యాచారం సరైన కారణమని’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.

విడాకులు కోరిన సదరు మహిళ అత్యంత దారుణమైన లైంగిక, శారీరక వేధింపులకు గురైనట్లుగా తమ దృష్టికి వచ్చిందని న్యాయస్థానం వెల్లడించింది. మహిళ అనారోగ్యంతో ఉన్నప్పుడు లైంగికంగా ఆమెను అనేకరకాలుగా భర్త్ హింసించాడని అది ఎంత మాత్రమూ సరైంది కాదని తెలిపింది. సదరు భర్త తల్లి మరణించింది అనే విషయం కూడా పట్టించుకోకుండా..ఏమాత్రం బాధ కూడా లేకుండా. కన్నతల్లి చనిపోయిన మరునాడే భార్యను లైంగికంగా హింసించాడు. బలవంతం చేశాడు.

అంతేకాదు ఆమెతో అసహజ శృంగారం చేయడమే కాకుండా..భార్యతో శృంగారం చేసే సమయంలో అక్కడే చిన్నపిల్లలు ఉన్నా లెక్క చేయకుండా పశువులా ప్రవర్తించాడని బాధితురాలు వాపోయింది. చిన్నపిల్లల ముందు లైంగికంగా తనకు ఇష్టం లేదని చెప్పినా..తనను (వైవాహిక అత్యాచారం) కలిసినట్లు బాధిత మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది. మహిళ ఎదుర్కొన్న చిత్రహింసలను గుర్తించిన కేరళ హైకోర్టు.. విడాకులు కోరడానికి అమె అన్ని హక్కు ఉన్నాయని తేల్చి చెప్పింది.

భార్య తాను చెప్పినట్లు నడుచుకోవాలని భర్త భావించినప్పుడు వైవాహిక అత్యాచారాలు జరుగుతాయని..భార్యను తన సొంత ఆస్తిగా..తన హక్కుగా భావించినప్పుడు ఇటువంటివి జరుగుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఏ భర్త అయినా సరే తన భార్య శారీరక, వ్యక్తిగత హక్కులపై క్లెయిమ్ చేయలేడని ఈ సందర్భంగా కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.