Kernel Helmet: మనిషి మెదడును చదివే హెల్మెట్.. ధర రూ.3,700!

మనిషి మెదడు ఆలోచనల ఖార్కానా. మన మెదడులో వచ్చే ఆలోచనల వేగాన్ని అందుకోవడం ఎవరివలన కాని పని. అయితే.. ఓ హెల్మెట్ మన మెదడుని చదివేస్తుంది. అమెరికాలోని కెర్నెల్‌ అనే ఓ స్వచ్ఛంద సంస్థ మనిషి మెదడును చదివే హెల్మెట్లను తయారు చేసింది.

Kernel Helmet: మనిషి మెదడును చదివే హెల్మెట్.. ధర రూ.3,700!

Kernel Helmet

Kernel Helmet: మనిషి మెదడు ఆలోచనల ఖార్కానా. మన మెదడులో వచ్చే ఆలోచనల వేగాన్ని అందుకోవడం ఎవరివలన కాని పని. అయితే.. ఓ హెల్మెట్ మన మెదడుని చదివేస్తుంది. అమెరికాలోని కెర్నెల్‌ అనే ఓ స్వచ్ఛంద సంస్థ మనిషి మెదడును చదివే హెల్మెట్లను తయారు చేసింది. ఇప్పటివరకు దీనిపై చేసిన పరీక్షలన్నీ ఆశాజనక ఫలితాలని ఇవ్వగా రానున్న వారం రోజుల్లో పలువురు కస్టమర్లుకు కూడా పంపునుంది. ఇక దీని ధరను 50 డాలర్లుగా ఖరారు చేసింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 3,700గా నిర్ణయించారు.

అయితే.. ఇంతకీ ఈ హెల్మెట్ మనిషి మెదడును ఎలా చదవగలదు.. దీని వెనుకున్న అసలు టెక్నీకల్ రహస్యం ఏంటంటే కాస్త మనం లోతుగా వెళ్ళాలి. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెన్సార్లు సాయంతో తయారుచేసిన ఈ హెల్మెట్ మనిషి రక్త ప్రవాహం, ఆలోచనల వేగం, బయట పరిస్థితులకు శరీరంలోని అవయవాలు స్పందిస్తున్న తీరును అంచనా వేసి ఒక డేటాను తయారుచేస్తుందట. నిజానికి గతంలో ఇలాంటి టెక్నాలజీతో కొన్ని వస్తువులు తయారుచేసినా అవి భారీ పరిమాణంతో పాటు గదికి పరిమితమై ఉండేవి.

కానీ, కెర్నల్ చేసిన పరికరం హెల్మెట్ పరిమాణంలో అదే ఆకారంలో కేవలం రెండు పౌండ్లు మాత్రమే బరువుతో ఉండడంతో మనిషి బయటకి వెళ్లేప్పుడు దీన్ని తలకు ధరించి వెళ్తే బయట పరిస్థితిలను బట్టి మన మెదడు స్పందనలను గుర్తించి చదివేస్తుంది. అంటే.. ఒకవిధంగా మనం బయటకి వెళ్లేప్పుడు మన పని మనం చేస్తే.. మనం ఏం చేస్తున్నామో అది చదివి డేటా చేసి పెడుతుంది. భవిష్యత్ లో ఇది ఎన్నో రంగాలలో పురోగతికి ఉపయోగపడుతుందని కెర్నల్ సంస్థ చెప్తుంది.