Mohan Juneja : కేజీఎఫ్ నటుడు మృతి.. సంతాపం తెలుపుతున్న కన్నడ సినీ ప్రముఖులు..
'కేజీఎఫ్ 1'లో ఓ కీ రోల్ లో నటించిన నటుడు మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. 'కేజీఎఫ్ 1' సినిమాలో రాకీ భాయ్ గురించి తెలుసుకోవడానికి జర్నలిస్ట్

Mohan
Mohan Juneja : ఇటీవల కన్నడ సినీ పరిశ్రమ నుంచి యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అంతకు ముందు వచ్చిన ‘కేజీఎఫ్ 1’ కూడా మంచి విజయం సాధించింది. ‘కేజీఎఫ్ 1’లో ఓ కీ రోల్ లో నటించిన నటుడు మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.
‘కేజీఎఫ్ 1’ సినిమాలో రాకీ భాయ్ గురించి తెలుసుకోవడానికి జర్నలిస్ట్ ఓ వ్యక్తి దగ్గరికి వస్తారు. ఆ వ్యక్తి రాకీ భాయ్ గురించి ఎలివేషన్స్ ఇస్తూ గొప్పగా చెప్తూ ఉంటాడు. ఆ వ్యక్తి పేరు మోహన్ జునేజా. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జన్మించిన జునేజా కన్నడ నటుడిగా సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. హాస్య నటుడిగా, విలన్ గా కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్ భాషల్లో దాదాపు 100 సినిమాల్లో నటించారు.
Suma Kanakala : యాంకర్ సుమకి షూటింగ్‌లో తప్పిన ప్రమాదం..
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. మోహన్ జునేజా మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.