KGF: Chapter 2: మూడు వందల రూపాయలతో బెంగళూరు వచ్చా: యశ్

తన కెరీర్ బిగినింగ్ డేస్‌లో పడ్డ ఇబ్బందుల గురించి యశ్ ఇటీవల మాట్లాడాడు. సినీ అవకాశాల కోసం మూడు వందల రూపాయలతో బెంగళూరులో అడుగుపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

KGF: Chapter 2: మూడు వందల రూపాయలతో బెంగళూరు వచ్చా: యశ్

Yash2

Bangalore: ‘కేజీఎఫ్-2’ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యశ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, ఈ స్థాయికి ఎదగడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అయితే, ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ, ఒకప్పుడు సాధారణ జీవితం గడిపాడు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. తన కెరీర్ బిగినింగ్ డేస్‌లో పడ్డ ఇబ్బందుల గురించి యశ్ ఇటీవల మాట్లాడాడు. సినీ అవకాశాల కోసం మూడు వందల రూపాయలతో బెంగళూరులో అడుగుపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో పుట్టిన యశ్ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు.

KGF2: మూడు రోజుల్లో కేజీయఫ్2 సెన్సేషన్!

తండ్రి డ్రైవర్. తల్లి గృహిణి. సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో యశ్ సినిమాల్లో చేరేందుకు వాళ్ల కుటుంబం అంగీకరించలేదు. అయితే, యశ్ సినిమాల్లో ప్రయత్నించేందుకు అతడికి కొంత సమయం ఇచ్చారు. ఆ లోపు అవకాశాలు దక్కించుకుంటే సరి. లేదంటే తాము చెప్పిన పని చేసుకుంటూ ఉండాలని సూచించారు. దీనికి అంగీకరించిన యశ్.. మూడు వందల రూపాయలతో బెంగళూరులో అడుగుపెట్టాడు. ఈ విషయం గురించి యశ్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు స్కూల్లో ప్రతి కాంపిటీషన్‌లో పోటీ చేసేవాడ్ని. అప్పుడు లభించిన ప్రశంసలు, బహుమతులే నన్ను ఈ స్థాయికి చేరేలా ప్రోత్సహించాయి. కొన్నేళ్లకు తల్లిదండ్రులను ఒప్పించి, సినిమాల కోసం బెంగళూరు చేరుకున్నా. అప్పుడు నా దగ్గర మూడు వందల రూపాయలే ఉన్నాయి. మొదట సీరియల్స్‌లో అవకాశం దక్కించుకున్నా. ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లోకి అడుగుపెట్టా’’ అని చెప్పుకొచ్చారు.

Beast – KGF 2 : 50 కోట్లు వర్సెస్ 50 లక్షలు.. ‘కేజిఎఫ్ 2’ దెబ్బకి చతికిలపడిన బీస్ట్..

యశ్ సీరియల్స్‌లో నటిస్తున్నప్పుడే మంచి పేరు సంపాదించుకున్నాడు. తర్వాత కన్నడ మూవీస్‌లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. చివరకు రాకీ మూవీతో హీరోగా మారాడు. తర్వాత అనేక సినిమాలు చేసిన యశ్ కన్నడలో మంచి స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు ‘కేజీఎఫ్-2’తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇటీవల విడుదలైన ‘కేజీఎఫ్-2’ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా హిందీలో రాకీ భాయ్‌కు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగులోనూ సినిమా ఘన విజయం సాధించింది.