APలో పెట్టుబడులపై KIA సంచలన ప్రకటన

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 09:11 AM IST
APలో పెట్టుబడులపై KIA సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో సంచలన ప్రకటన చేసింది KIA సంస్థ. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కార్లు ఉత్పత్తి తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 54 మిలియన్ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. కియా SUV వెహికల్స్ తయారీకి ఏపీలో కొత్తగా పెట్టుబడులు పెడుతున్నట్లు కియా సీఈవో కూక్యూన్ షిమ్ 2020, మే 28వ తేదీ గురువారం ప్రకటించారు. మన పాలన – మీ సూచన పేరిట వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2020, మే 28వ తేదీ గురువారం పరిశ్రమలు – పెట్టుబడులపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. పరిశ్రమలు – పెట్టుబడులపై సీఎం జగన్ ప్రకటించిన కొద్దిసేపటికే కియా పై విధంగా స్పందించడం విశేషం. 

ఏపీలోని అనంతపురం జిల్లాలో బిలియన్ డాలర్ల పెట్టుబడితో టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీ ప్లాంటును నెలకొల్పింది కియా. అనంతరం ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో కియా పరిశ్రమ తరలిపోతోందంటూ..ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందంటూ అంతర్జాతీయ వార్తా సంస్ధ రాయిటర్స్ కథనం రేపిన సంచలనం రేపింది. ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు స్పందించాయి. కియా మోటార్స్ ఎక్కడికీ వెళ్లిపోవడం లేదని, తమిళనాడుతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని వివరణ ఇచ్చాయి. కియా తమతో ఎలాంటి చర్చలు జరపలేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

కియా కార్ల తయారీ ప్లాంటు ద్వారా 4 వేల శాశ్వత ఉద్యోగాలు, 7వేల తాత్కాలిక ఉద్యోగాలు కల్పించనుంది. కార్ల పరిశ్రమకు తగినట్టుగా స్థానిక యువతలో నైపుణ్యాలను పెంచేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కియా పనిచేస్తోంది. కియాతోపాటు ఆ సంస్థ వెండార్లు ఇప్పటి వరకు 12వేల 835 మందికి ఉపాధి కల్పించాయి. అనంతపురం జిల్లాకకు చెందిన 7వేల 29మందికి ఉపాధి లభించింది. కియాతోపాటు ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ కూడా అనంతపురం జిల్లాలోనే ఏర్పాటు కానున్నట్టు ప్రచారం సాగుతోంది. వెయ్యికోట్ల పెట్టుబడితో వీరా వాహన్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుందని సీఎంవో తెలిపింది. 

 

Read:  ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం.. జరిగింది కదా అని అరెస్టు చేయలేం..తొందర పాటు వద్దు – సీఎం జగన్