Wild Dog : నాగ్ పరిచయం చేస్తున్న 40వ దర్శకుడు..

ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ, కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేస్తూ, కొత్త కంటెంట్‌తో కూడిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఆరు పదుల వయసు దాటినా ప్రయోగాలకు వెనుకాడకుండా ప్రేక్షకాభిమానులను ఆశ్యర్చపరుస్తున్నారు ‘కింగ్’ అక్కినేని నాగార్జున.

Wild Dog : నాగ్ పరిచయం చేస్తున్న 40వ దర్శకుడు..

Nagarjuna

Nagarjuna: ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ, కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేస్తూ, కొత్త కంటెంట్‌తో కూడిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఆరు పదుల వయసు దాటినా ప్రయోగాలకు వెనుకాడకుండా ప్రేక్షకాభిమానులను ఆశ్యర్చపరుస్తున్నారు ‘కింగ్’ అక్కినేని నాగార్జున.

రామ్ గోపాల్ వర్మ ‘శివ’ నుండి కళ్యాణ్ కృష్ణ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వరకు ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్స్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేసిన నాగ్ ‘వైల్డ్ డాగ్’ తో అహిసోర్ సాల్మన్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే నాగ్ పరిచయం చేస్తున్న 40వ దర్శకుడాయన.

Wild Dog

‘కింగ్’ నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. అహిషోర్ సోల్మ‌న్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగ్ ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారి ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో కనిపించనున్నారు. సయామీ ఖేర్, అలి రజా తదితరులు కీలకపాత్రల్లో నటించారు..ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో ‘వైల్డ్ డాగ్ బేస్ క్యాంప్ ఈవెంట్’ నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్స్ సాధించిన ‘జెర్సీ’ ‘మహర్షి’ దర్శకులను సత్కరించారు ‘వైల్డ్ డాగ్’ టీమ్.

తానెప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటానని, ‘ఊపిరి’ లో నాకు తమ్ముడిగా నటించిన కార్తి ‘సుల్తాన్’ సినిమా కూడా ఏప్రిల్ 2నే రిలీజవుతోంది. ఆ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని నాగ్ అన్నారు. నాగార్జున గారు కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. ఇండస్ట్రీలో ఎవరు కొత్త కాన్సెప్ట్ రెడీ చేసినా మందు నాగార్జున గారికే వినిపిస్తారు. ఈ సినిమాతో నాగ్ సార్ పరిచయం చేస్తున్న 40వ దర్శకుడు సాల్మన్ అని నిర్మాత నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చూసిన టీమ్ U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఏప్రిల్ 2న బాక్సాఫీస్ వద్ద ‘వైల్డ్ డాగ్’ హంటింగ్ స్టార్ట్ కానుంది.