Athiya-KL Rahul : పెళ్లి తర్వాత మొదటిసారి గుడికి వెళ్లిన అతియా-KL రాహుల్.. ఉజ్జయిని మహా కాళేశ్వర ఆలయంలో పూజలు..
తాజాగా KL రాహుల్ -అతియాశెట్టి మధ్యప్రదేశ్ లోని అత్యంత ప్రముఖ దేవాలయం ఉజ్జయిని మహాంకాళేశ్వర దేవాలయానికి వెళ్లారు. అక్కడ సాధారణ భక్తులతో కలిసి శివుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఉజ్జయిని దేవాలయంలో..............

KL Rahul and Athiya shetty first time went to temple after marriage perform special worships in ujjain mahankalehswar temple
Athiya-KL Rahul : ఇండియన్ క్రికెటర్ KL రాహుల్ ఇటీవల జనవరి 23న బాలీవుడ్ నటి, స్టార్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా వీళ్ళు ప్రేమలో ఉన్నారంటూ, డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చినా దీనిపై ఇద్దరూ స్పందించలేదు. కాని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ అనేకసార్లు మీడియా కంట పడ్డారు.
ఇరు కుటుంబాలు పెళ్ళికి ఒప్పుకోవడంతో 2023 జనవరి 23న KL రాహుల్, అతియా శెట్టి వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, పలువురు సినీ, క్రీడా ప్రముఖులు వీరి పెళ్ళికి విచ్చేసి ఆశీర్వదించారు. పెళ్లి జరిగి నెల రోజులు అవుతున్నా వీళ్ళు ఇంతవరకు బయట కనపడలేదు. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు తప్ప పెళ్లి అనంతరం ఫోటోలు అస్సలు పోస్ట్ చేయలేదు.
Kishore Kumar Biopic : బాలీవుడ్ లో మరో బయోపిక్.. లెజండరీ యాక్టర్ / సింగర్ బయోపిక్‌లో రణబీర్..
తాజాగా KL రాహుల్ -అతియాశెట్టి మధ్యప్రదేశ్ లోని అత్యంత ప్రముఖ దేవాలయం ఉజ్జయిని మహాంకాళేశ్వర దేవాలయానికి వెళ్లారు. అక్కడ సాధారణ భక్తులతో కలిసి శివుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఉజ్జయిని దేవాలయంలో మహాంకాళేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పెళ్లి తర్వాత మొదటి సారి ఈ జంట బయట కనపడటం, అది కూడా ప్రముఖ దేవాలయంలో కనిపించడంతో వీరి ఫోటోలు వైరల్ గా మారాయి.
महाकाल की शरण में पहुंचे #KLRahul-अथिया शेट्टी, भस्म आरती कर लिया भोलेनाथ का आशीर्वाद।
– NZ सीरिज़ के वक्त टीम इंडिया के कई खिलाड़ियों ने भी किए थे महाकाल दर्शन।
– विराट-अनुष्का की भी कई मंदिरों के दर्शन की तस्वीरें हुई है इन दिनों वायरल। #Mahakaleshwar #AthiyaShetty pic.twitter.com/llBZy94yOa— Shubhankar Mishra (@shubhankrmishra) February 26, 2023