BCCI Central Contracts: జడేజాకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. గ్రేడ్ ’బి‘కి పడిపోయిన కే.ఎల్. రాహుల్‌

బీసీసీఐ (BCCI) ఆటగాళ్లకు నాలుగు విభాగాల్లో వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటిస్తుంది. వీటిలో ఎ ప్లస్, ఎ, బి, సీ గ్రేడ్‌లు ఉంటాయి. ఏ ప్లస్ గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు రూ. 7కోట్లు, ఎ గ్రేడ్ విభాగంలో ప్లేయర్ల‌కు రూ. 5 కోట్లు, బి గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు రూ. 3కోట్లు, సి గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు రూ. కోటి వేతనం చెల్లిస్తుంది.

BCCI Central Contracts: జడేజాకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. గ్రేడ్ ’బి‘కి పడిపోయిన కే.ఎల్. రాహుల్‌

BCCI Central Contracts

Updated On : March 27, 2023 / 7:12 AM IST

BCCI Central Contracts: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) BCCI  ఆటగాళ్లకు సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గతేడాది ‘ఏ’ గ్రేడ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ప్రమోషన్ సాధించి ‘ఏ’ ప్లస్ గ్రేడ్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే, వరుస వైఫల్యాలతో సతమతమవుతూ వస్తున్న కేఎల్ రాహుల్‌ (K.L.Rahul) కు బీసీసీఐ షాకిచ్చింది. ఇప్పటి వరకు ‘ఏ’ గ్రేడ్‌లో ఉండగా ప్రస్తుతం ‘బి’ గ్రేడ్‌కు పడిపోయాడు. బౌలింగ్ విభాగంలోనూ, బ్యాటింగ్ విభాగంలోనూ కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అక్షర్ పటేల్‌ (Axar Patel) కు ‘ఎ’ గ్రేడ్ లోకి ప్రమోషన్ లభించింది. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ టెస్టుల్లో అరంగ్రేటం చేసిన ఆంధ్రా క్రికెటర్ భరత్ కు బోర్డు కాంట్రాక్ట్ దక్కింది. అతను ‘సి’ గ్రేడ్ లో కొనసాగుతాడు.

WPL Final 2023 : తొలి WPL టైటిల్ విజేత ముంబై ఇండియన్స్

బీసీసీఐ ఆటగాళ్లకు నాలుగు విభాగాల్లో వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటిస్తుంది. వీటిలో ఎ ప్లస్, ఎ, బి, సీ గ్రేడ్‌లు ఉంటాయి. ఏ ప్లస్ గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు రూ. 7కోట్లు, ఎ గ్రేడ్ విభాగంలో ప్లేయర్ల కు రూ. 5 కోట్లు, బి గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు రూ. 3కోట్లు, సి గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు రూ. కోటి వేతనం చెల్లిస్తుంది. బీసీసీఐ ఆదివారం ప్రకటించిన జాబితాలో మొత్తం 26 మంది ప్లేయర్లు ఉన్నారు. వారిలో నలుగురికి ఎ ప్లస్ గ్రేడ్ దక్కింది. ఐదుగురు ప్లేయర్లకు ఎ గ్రేడ్, ఆరుగురికి ‘బి’ గ్రేడ్ లో చోటుదక్కగా.. మిగిలిన పదకొండు మంది ప్లేయర్లకు సీ గ్రేడ్ లభించింది.

BCCI Review Meet: టార్గెట్ వన్డే వరల్డ్ కప్.. రివ్యూ మీటింగ్‌లో బీసీసీఐ కీలక నిర్ణయాలు

‘ఎ ప్లస్’ గ్రేడ్‌లో : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా.

‘ఎ’ గ్రేడ్‌లో : హార్ధిక్ పాండ్యా, అశ్విన్, షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్.

‘బి’ గ్రేడ్‌లో : పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్.

‘సీ’ గ్రేడ్‌లో : ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ సామ్సన్, అర్ష్ దీప్ సింగ్, కోన శ్రీకర్ భరత్.