BCCI Review Meet: టార్గెట్ వన్డే వరల్డ్ కప్.. రివ్యూ మీటింగ్‌లో బీసీసీఐ కీలక నిర్ణయాలు

భారత్‌లో ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని ఓ హోటల్‌లో బీసీసీఐ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ 20మంది ఆటగాళ్ల లిస్ట్‌ను సిద్ధంచేసింది.

BCCI Review Meet: టార్గెట్ వన్డే వరల్డ్ కప్.. రివ్యూ మీటింగ్‌లో బీసీసీఐ కీలక నిర్ణయాలు

BCCI Review Meet

BCCI Review Meet: భారత్‌లో ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని సెవెన్ స్టార్ హోటల్‌లో బీసీసీఐ సమీక్ష సమావేశం జరిగింది. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఎన్సీఏ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్, మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తదితరులు హాజరయ్యారు. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. అయితే, ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

BCCI: టీమిండియా కొత్త షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. హైదరాబాద్‌, వైజాగ్‌లో వన్డే మ్యాచ్‌లు

2023 సంవత్సరంలో సొంతగడ్డపై భారత్ 35 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ క్రమంలో ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా మేనేజ్మెంట్ దృష్టిసారించింది. 2022లో ఆసియా కప్, టీ20 కప్ రెండింటిల్లోనూ టీమిండియా విజయం సాధించలేదు. వీటిపై సమీక్షలో సుదీర్ఘ చర్చజరిగినట్లు తెలిసింది. అయితే, ఆటగాళ్లు తరచూ గాయాల భారిన పడుతున్నారు. వీరి ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు ప్రస్తుతం యోయో టెస్ట్ నిర్వహిస్తున్నారు. రాబోయేకాలంలో గాయపడిన ఆటగాళ్లు తిరిగి జట్టులో చేరాలంటే యోయో టెస్టుతో పాటు డెక్సా టెస్టు కూడా నిర్వహించాలని, అందులో నెగ్గితేనే జట్టులోకి సెలక్ట్ చేయాలని నిర్ణయించింది.

 

దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన, అనుభవం కలిగిన క్రికెటర్లనే జాతీయ జట్టుకు సెలక్ట్ చేయాలని బీసీసీఐ సెలెక్టర్లను ఆదేశించింది. మార్చి, ఏప్రిల్ నెలలో ఐపీఎల్ టోర్నీ నేపథ్యంలో క్రికెటర్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఐపీఎల్ ప్రాంచైజీలతో కలిసి పనిచేయాలని జాతీయ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ సూచించింది. అయితే, 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ 20 మంది ఆటగాళ్ల లిస్ట్‌ను సిద్ధంచేసింది.