కప్పు టీ రూ. 1000..! ఫైవ్ స్టార్ హోటల్లో కాదు రోడ్డు పక్కనే..!!

కప్పు టీ రూ. 1000..! ఫైవ్ స్టార్ హోటల్లో కాదు రోడ్డు పక్కనే..!!

 cup of tea Rs. 1000 : ఉదయాన్నే ఒక కప్పు వేడి వేడి టీ గొంతులో దిగితే ఆ మజానే వేరు. పొద్దు పొద్దున్నే ఓ కప్పు టీ తాగితే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఆ తరువాత చక్కగా ఉత్సాహంగా పనులు చకచకా అయిపోతాయి.అలాగే తలనొప్పి, పనిలో ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓ కప్పు టీ తాగితే..ఫ్రెష్ గా మళ్లీ పని స్టార్ట్ చేసేసుకోవచ్చు..

అలా ఉన్నప్పుడు ఓ కప్పు టీ తాగుదామని రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లి..బాబూ ఓ కప్పు టీ అని చెప్పగానే..హా అవునూ కప్పు టీ ఎంత అని అడిగితే రూ.1000లు సార్ అయి చెబితే..‘ఓ బాబూ నేను అడిగేది ఏ ఫైవ్ స్టార్ హోటల్ రేటో కాదు నీ షాపులో ఎంతా? అని అని మళ్లీ అడిగితే..మీరు విన్నది నిజమే సార్..టీ కప్పు రూ.1000 అని చెబితే..దెబ్బకు దిమ్మ తిరిగిపోతుంది కదూ..ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే..పశ్చిమ బెంగాల్‌లోని కొల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి షాపులో కప్పు టీ అక్షరాలా రూ.1000లు..!!

సాధారణంగా కప్పు టీ ధర 10,20 రూపాయలు ఉంటుంది. ఇంకా స్పెషల్ టీ అయితే కాస్త ఎక్కువే అయినా ఓ రూ.100 అనుకుందాం..కానీ కొల్‌కతాలోని ముకుందాపూర్ లో పార్థ ప్రతీం గంగూళీ అనే వ్యక్తి తన టీ స్టాల్‌లో టీ కప్పు ధర రూ.1000లు. గంగూళీ తన షాపులో తయారు చేసే టీలు చాలా చాలా వెరైటీ..వందకు పైగా వెరైటీ టీలను తయారు చేసి అమ్ముతున్నాడు గంగూళీ. వేలకులతోనే కాదు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో గంగూళీ తయారు చేసే టీలకు భలే గిరాకీ.మాంచి టేస్టీగా ఉండే గంగూళీ టీలు అంటే వెరీ వెరీ ఫేమస్‌. ఎంత ఫేమస్ అంటే..పక్క రాష్ట్రాల వారు కూడా ఇక్కడకు వచ్చి టీ తాగేంత ఫేమస్.

మరీ అంత ఫైవ్ స్టార్ హోటల్లో రేట్లను తలపించే ఈ టీ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.. ఓ ప్రైవేట్ జాబ్ చేసుకునే గంగూళీ 2014లో నిర్జాష్‌‌ అనే పేరుతో ముకుంద్‌పూర్‌లో టీ స్టాల్ స్టార్ట్ చేశాడు. సాధారణంగా టీ స్టాల్ పెడితే అందరికీ నాకూ తేడా ఏముంటుంది? పైగా వ్యాపార పోటీని కూడా తట్టుకోవాలి..దీంతో తన టీ స్టాల్ లో టీలు వెరీటీగా ఉండాలనుకున్నాడు.

అలా ఎన్నో రకాలు టీలు తయారు చేయటం నేర్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా లభించే 115 రకాల టీలు గంగూళీ టీ స్టాల్ లో అందుబాటులో ఉంటాయి. కేజీకి రూ. 2.8 లక్షలు పలికే జపాన్‌ స్పెషల్ టీ సిల్వర్ నీడిల్ వైట్ టీ, రూ. 50వేలు నుంచి రూ. 32 లక్షల వరకు ధర పలికే ఉండే బో-లే టీ కూడా ఈ షాపులో అందుబాటులో ఉంటుంది.

ఇతని స్టాల్ లో రూ.1000 అమ్మే ఆ టీ జపనీస్ వైట్ లీఫ్ టీగా అని పిలుస్తారు. ఈ ప్రీమియం టీకి వెయ్యి రూపాయలు అంత ఎక్కువ ధరేమీ కాదంటున్నాడు గంగూలీ. కానీ ఇక్కడ ఎక్కువ మంది మాత్రం మస్కటెల్ టీని తాగుతారంట. ఈ టీ తాగేందుకు చాలా మంది క్యూ కడుతుంటారు. ఇక ఈ టీ స్టాల్ మీదుగా వెళ్లే ప్రతి ఒక్కరూ కాకపోయినా 1000 మందిలో 100 మంది ఖచ్చితంగా అక్కడ ఆగి టీ తాగుతారట. అసలు ఆ షాపులోంచి వచ్చే టీ పరిమళాలు టీ తాగందే అడుగు ముందుకు పడనివ్వవట..

ఇన్ని వెరైటీ టీ ఇంత టేస్టీ టీలు పెట్టే గంగూలీని చుట్టుపక్కల ప్రజలంతా ముద్దుగా ‘పార్థ బాబూ’ అని పిలుచుకుంటారట. అక్కడి స్థానికులు కొన్ని వెరైటీ టీలకు ముందుగానే ఇక్కడ అడ్వాన్స్ చెల్లిస్తుంటారంట. కేవలం టీ అమ్మడం మాత్రమే కాదు.. టీ పౌడర్‌ని కూడా గంగూలి అమ్ముతుంటాడు. దేశవ్యాప్తంగా చాలా మంది టీ వ్యాపారులు గంగూలీ వద్ద ముడీ టీని తీసుకేళ్లుంటారని గంగూలీ చెప్పుతున్నాడు. కానీ అంత కాస్ట్లీ టీ తాగటం అందరికీ సాధ్యం కాకపోయినా..అందుకని కనీసం ఆ టీ పరిమళాలు ఆస్వాదించిపోదామనుకుని కాసేపు ఆగి గుండెల నిండా ఆ వాసనలను పీల్చుకుని వెళదాం అనుకునేలా ఉంటాయట గంగూళీ తయారు చేసే టీ పరిమళాలు..