T.Congress : కాంగ్రెస్‌‌లో కొత్త లొల్లి, నేతల పంచాయితీ సభా వేదికనే మార్చేసింది

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో రగడ రాజుకుంది. ద‌ళిత, గిరిజ‌న దండోరా స‌భ నేతల మధ్య చిచ్చురేపింది. ఇంద్రవెల్లి సభను మ‌హేశ్వర్‌రెడ్డి వ్యతిరేకించగా... ఇబ్రహీంప‌ట్నం స‌భ‌ను కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు కూడా అనుమతి నిరాకరించడంతో చివరికి కాంగ్రెస్ పెద్దలు స‌భాస్థలిని రావిరాలకు మార్చారు.

T.Congress : కాంగ్రెస్‌‌లో కొత్త లొల్లి, నేతల పంచాయితీ సభా వేదికనే మార్చేసింది

Komati

Dalit Dandora Sabha : తెలంగాణ కాంగ్రెస్‌లో మరో రగడ రాజుకుంది. ద‌ళిత, గిరిజ‌న దండోరా స‌భ నేతల మధ్య చిచ్చురేపింది. ఇంద్రవెల్లి సభను మ‌హేశ్వర్‌రెడ్డి వ్యతిరేకించగా… ఇబ్రహీంప‌ట్నం స‌భ‌ను కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు కూడా అనుమతి నిరాకరించడంతో చివరికి కాంగ్రెస్ పెద్దలు స‌భాస్థలిని రావిరాలకు మార్చారు.

Read More : CM Jagan : భీమవరానికి సీఎం జగన్, పేలుళ్ల కలకలం

ఇంద్రవెల్లి దళిత, గిరిజ‌న దండోర సభ స‌క్సెస్ కావ‌డంతో అదే వేదిక నుంచి తర్వాత ఇబ్రహీంప‌ట్నంలో స‌భ నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రక‌టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయమే తెలంగాణ కాంగ్రెస్‌లో అగ్గి రాజేసింది. నేతల మధ్య పంచాయితీకి కారణమైంది. తనకు సమాచారం లేకుండా…సభా ఎలా నిర్వహిస్తారంటూ ఫైర్ అయ్యారు కోమటరెడ్డి వెంకట్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు అనుమతినిచ్చినా…సభ నిర్వహించవద్దని ట్విట్టర్ వేదికగా ఆయన కుండబద్ధలు కొట్టారు. ఇన్ డైరెక్టుగా తాను ఇబ్రహీంప‌ట్నం స‌భ‌కు హాజ‌రు కావ‌డం లేద‌ని చెప్పక‌నే చెప్పారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Read More : Coronavirus : బాబోయ్.. ఒక్కరోజే 7లక్షల కరోనా కేసులు, 10వేల మరణాలు

కోమటిరెడ్డి చేసిన ట్వీట్ తో తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలైంది. సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై తర్జనభర్జనలు జరిగాయి. మొండిగా సభ అక్కడే నిర్వహిస్తే..పరిణామాలు దేనికైనా దారి తీయొచ్చని నేతలు భావించారు. స‌భా స్థలిని మార్చాల‌ని నిర్ణయించారు. మ‌రోవైపు ఇబ్రహీంప‌ట్నంలో స‌భ‌కు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షల పేరుతో అనుమ‌తి నిరాక‌రించ‌డంతో పాటు పార్టీలో కూడా అంత‌ర్గత పోరు సాగుతుండ‌టంతో స‌భ స్థలిని మార్చాల‌ని టీకాంగ్రెస్ నిర్ణయించింది.

Read More : గోదారి గర్భంలోకి రుద్రమ కోట… త్వరలోనే మాయం

ముందుగా నిర్దేశించుకున్న భువ‌నగిరి పార్లమెంట్ నియోజ‌కవ‌ర్గం ఇబ్రహీంప‌ట్నంలో కాకుండా చేవెళ్ళ పార్లమెంట్ నియోజ‌కవ‌ర్గంలోని మ‌హేశ్వరం రావిరాలలో స‌భ నిర్వహించాల‌ని నిర్ణయించారు. ఇప్పటికే మ‌హేశ్వరం నియోజ‌కవ‌ర్గంలో రేవంత్ రెడ్డి పాద‌యాత్ర ముగింపు స‌భ‌ను నిర్వహించి స‌క్సెస్ కావడంతో… అదే సెంటిమెంట్‌గా ఆ ప్రాంతంలోనే ద‌ళిత‌, గిరిజ‌న స‌భ నిర్వహించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది.