TS Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధిష్టానం దృష్టిసారించింది. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి అధికారంలో రావడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు వ్యూహాలు సిద్ధం...

TS Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Komati Reddy Venkata Reddy

TS Congress :  తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధిష్టానం దృష్టిసారించింది. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి అధికారంలో రావడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత రాష్ట్ర పార్టీలో నేతల మధ్య నెలకొన్న వర్గ విబేధాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర పార్టీ పెద్దలు దృష్టిసారించారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన నాటి నుంచి పార్టీలోని కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. జగ్గారెడ్డి, హనుమంత్ రావు లాంటి వారు బహిరంగంగానే రేవంత్ తీరును తప్పుబడుతూ వస్తున్నారు. ఈ కోవలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికూడా ఉన్నారు.

Telangana Congress: రాహుల్ దిశానిర్దేశం

రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విబేధాలను తొలగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఇటీవల రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీలో వర్గ విబేధాలు వీడి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే పలువురు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రేవంత్ ఒంటెద్దు పోకడలతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పార్టీ నేతలందరిని కలుపుకొని పోతే తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని వివరించినట్లు తెలిసింది. దీనికితోడు కోమటిరెడ్డిసైతం కొంత అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు సమాచారం.

T Congress: టీ కాంగ్రెస్ నేతలకు సోనియా మందలింపు..!

ఈ క్రమంలో సోనియా, రాహల్ గాంధీల ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ ఛార్జి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే తుంగతుర్తి నియోజకవర్గంలో డాక్టర్ రవిని కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ రావు లేఖ రాశారు. ఈ లేఖలో మాజీ పీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలపై సోనియాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే కోమటిరెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా నియమిస్తూ ఉత్తర్వులు రావడం గమనార్హం.