Ram Charan: సిద్ధ పుట్టిందే చరణ్ కోసం – కొరటాల శివ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాలని.....

Ram Charan: సిద్ధ పుట్టిందే చరణ్ కోసం – కొరటాల శివ

Koratala Siva Denies Rumours Of Siddha Role For Mahesh Babu

Updated On : April 26, 2022 / 2:59 PM IST

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కరోనా ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. వేసవి కానుకగా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Acharya: ఆచార్యకు ముందే చరణ్ కోసం కొరటాల కథ.. సెట్స్ మీదకు ఎప్పుడో?

రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో ఆచార్య చిత్ర ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన ఆచార్య టీమ్, తాజాగా వరుస ఇంటర్వ్యూలతో దుమ్ములేపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానల్‌కు దర్శకుడు కొరటాల శివ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆచార్య సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో చిరు పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుందని.. మెగాస్టార్‌ను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసి ఉండరని ఆయన అన్నారు. ఇక ఆచార్య చిత్రానికే వెన్నుముక్క అయిన ‘సిద్ధ’ పాత్రలో రామ్ చరణ్ తప్ప మరెవరినీ కూడా ఊహించుకోలేమని కొరటాల పేర్కొన్నారు.

Ram Charan : ‘ఆచార్య’లో నేను ఉన్నానని నాకే తెలీదు..

ఆచార్య సినిమాలో చరణ్‌ను కూడా తీసుకోవాలనే ఆలోచనతోనే సిద్ధ పాత్ర పుట్టుకొచ్చిందని ఆయన అన్నారు. ఆచార్య మూవీలో సిద్ధ పాత్ర కోసం గతంలో మహేష్ బాబును సంప్రదించినట్లు, ఆయన ఈ పాత్రను రిజక్ట్ చేసినట్లు వచ్చిన వార్తలపై కొరటాల ఫైర్ అయ్యారు. సిద్ధ పాత్రను కేవలం రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నదని.. అంతేతప్ప మరే ఇతర హీరో కోసమో ఈ పాత్రను రాయలేదని కొరటాల ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇక సిద్ధ పాత్ర ప్రేక్షకులను ఎమోషనల్‌గా ఆకట్టుకోవడమే కాకుండా చాలా ఇన్‌స్పైరింగ్‌గా కూడా ఉంటుందని కొరటాల అన్నారు. ఏదేమైనా సిద్ధ పాత్ర కేవలం రామ్ చరణ్ కోసమే పుట్టిందని కొరటాల అనడంలో, చరణ్ ఈ పాత్రలో ఎంతమేర ఆకట్టుకోబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.