San Diego Zoo : అమెరికా శాండియాగో జూలో కోవిడ్ కలకలం…ఓ చిరుతకు సోకిన వైరస్

గతంలో ఇదే జూలో ఉన్న ఎనిమిది గొరిల్లాలకు కరోనా వైరస్ సంక్రమించింది. జూ కీపర్ ద్వారా ఇది గొరిల్లాలకు సంక్రమించిందని అప్పట్లో అధికారులు నిర్ధారించారు.

San Diego Zoo : అమెరికా శాండియాగో జూలో కోవిడ్ కలకలం…ఓ చిరుతకు సోకిన వైరస్

Sandiego

San Diego Zoo : కరోనా మనుషులతోపాటు జంతువులకు ప్రాణసంకటంగా మారింది. జూలలో ఉండే అరుదైన ప్రాణులు దీని భారిన పడుతున్నాయి. ఇప్పటికే భారత దేశంలో పలు జూలలో అడవి జంతువులు కరోనా బారిన పడగా, తాజాగా అమెరికాలోని శాండియాగో జూలో ఉన్న స్నో లెపర్డ్ మంచు చిరుతకు కరోనాసోకింది. జూలో ఉన్న రామిల్ అనే చిరుత జలుపు, దగ్గుతో బాధపడుతుంది. ఆలనపాలన చూసే కేరే టేకర్ కు రామిల్ ఆరోగ్యం విషయంలో అనుమానం కలిగింది.

దీంతో విషయాన్ని జూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జూ జంతువిభాగం వైద్య నిపుణులు రామిల్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో రామిల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. మగ చిరుతైన రామిల్ తో కలసి మరో రెండు చిరుతలు ఉన్నందున వాటిని వేరువేరుగా క్వారంటైన్ లో ఉంచారు. ప్రస్తుతం జూలోకి సందర్శకులు ఎవరు రాకుండా మూసివేశారు.

గతంలో ఇదే జూలో ఉన్న ఎనిమిది గొరిల్లాలకు కరోనా వైరస్ సంక్రమించింది. జూ కీపర్ ద్వారా ఇది గొరిల్లాలకు సంక్రమించిందని అప్పట్లో అధికారులు నిర్ధారించారు. అయితే గొరిల్లాల్లో మాత్రం ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం చిరుత కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో ఎలా వైరస్ సంక్రమించిందన్న దానిపై జూ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు జూలోని కొన్ని జంతువులకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో వైరస్ సంక్రమించే అవకాశం ఉన్న పెద్ద పిల్లులకు వ్యాక్సిన్ అందించారు. చిరుత పులలకు అప్పట్లో వ్యాక్సిన్ ఇవ్వలేదు. జూ సిబ్బందికి వ్యాక్సిన్ తీసుకోకపోవటంతో జూలో జంతువుల ఆలనాపాలన చూసే సిబ్బంది. పూర్తిస్ధాయిలో ముసుగులు ధరించి జంతువుల వద్దకు వెళ్ళాలని జూ ఉన్నతాధికారులు అదేశాలు జారీచేశారు.