Kriti Sanon : నిర్మాణ సంస్థని అనౌన్స్ చేసిన కృతి సనన్.. సుశాంత్ సింగ్ జ్ఞాపకాలతో ప్రొడక్షన్ హౌస్ పేరు..!
కృతి సనన్ నిర్మాతగా మారబోతుంది. 'బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్' పేరిట తన నిర్మాణ సంస్థని అనౌన్స్ చేసింది. అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ పేరు చూసి నెటిజెన్స్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ని గుర్తుకు చేసుకుంటున్నారు.

Kriti Sanon announce Blue Butterfly Films production Sushanth Singh Rajput
Kriti Sanon : కృతి సనన్ తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రీసెంట్ గా ఈ భామ ఆదిపురుష్ (Adipurush) సినిమాలో సీతగా కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని అందుకున్న ఈ భామ.. ఇప్పుడు నిర్మాతగా మారబోతుంది. ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ చేసి 9 ఏళ్ళు అయ్యిందని, ఈ ప్రయాణంలో నటిగా ఎంతో నేర్చుకున్నట్లు, ఎదిగినట్లు చెప్పుకొచ్చిన కృతి.. ఇప్పుడు మరింత నేర్చుకొనే సమయం వచ్చిందని, అందుకే నిర్మాతగా కెరీర్ మొదలు పెట్టబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియాజేసింది.
Allu Arjun : సామజవరగమన పై అల్లుఅర్జున్ ట్వీట్.. నా మలయాళీ భామ రెబా మోనికా జాన్..
‘బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్’ (Blue Butterfly Films) పేరిట తన నిర్మాణ సంస్థని అనౌన్స్ చేస్తూ ఒక వీడియోని కృతి షేర్ చేసింది. అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ పేరు చూసి నెటిజెన్స్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushanth Singh Rajput) ని గుర్తుకు చేసుకుంటున్నారు. అసలు ఆ పేరుకి సుశాంత్ సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏంటంటే.. సుశాంత సింగ్ తన సోషల్ మీడియా పోస్టులలో ఎక్కువుగా బ్లూ బట్టర్‌ఫ్లై ఎమోజీని ఉపయోగించేవాడు. దానినే ఉపయోగించడం పై కూడా సుశాంత చేసిన ఒక కామెంట్ అప్పటిలో వైరల్ అయ్యింది.

Kriti Sanon announce Blue Butterfly Films production Sushanth Singh Rajput
ఇక సుశాంత్ అండ్ కృతి అప్పటిలో మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి ‘రాబ్తా’ సినిమాలో నటించారు. ఇప్పుడు తన నిర్మాణ సంస్థకి ‘బ్లూ బటర్‌ఫ్లై’ అనే పేరుని పెట్టి కృతి.. సుశాంత్ కి ట్రిబ్యూట్ ఇచ్చిందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ బ్యానర్ లో కృతి ముందుగా ఏ సినిమా నిర్మించబోతుందో చూడాలి. యాక్టర్ గా కృతి సినిమాలు విషయానికి వస్తే.. గణపత్, ది క్రూ సినిమాల్లో నటించగా ఆ రెండు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.
View this post on Instagram