కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మార్పు ? నిర్మలా సీతారామన్ స్థానంలో

  • Published By: madhu ,Published On : June 4, 2020 / 12:34 AM IST
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మార్పు ? నిర్మలా సీతారామన్ స్థానంలో

కేంద్ర ఆర్థిక శాఖకు కొత్త మంత్రి రానున్నారా ? మంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ కు వేరే బాధ్యతలు అప్పచెబుతారా ? అనే చర్చ జరుగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా సీనియర్ బ్యాంకర్ KV కామత్ నియమితులు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన బ్రిక్స్ దేశఆల న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ANDB) చీఫ్ గా ఉన్నారు. ఇటీవలే ఐదేండ్లు పూర్తి చేసుకున్నారు. జులై నెలలో ఈ బాధ్యతలను మరొకరికి అప్పగించడంతో..ఈయనకు ఆర్థిక మంత్రి పదవి పక్కా అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇప్పుడే ఎందుకు ?..దేశంలో కరోనా వైరస్ కారణంగా..ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అసలే మందగమనంలో ఉన్న ఎకనామిని పూర్తిగా దెబ్బతీసింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక శాఖ పగ్గాలను వేరేవారికి అప్పచెప్పాలనే భావనలో మోడీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ప్రముఖ వ్యాపారస్తులైన ముకేశ్, అనీల్ అంబానీల ఆస్తుల పంపకాల్లో కామత్ పెద్ద దిక్కుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ICICI బ్యాంకు మాజీ ఛైర్మన్ష గా బ్యాంకింగ్ రంగంలో విశేష అనుభవం ఉంది కామత్‌కు కానీ ఈయనపై అవినీతి ఆరోపణలున్నాయి. NDTV ప్రమోటర్ ప్రణయ్ రాయ్ మోసం చేసి తీసుకున్న రుణాలు..బ్యాంకు వివాదాస్పద CEO చందా కొచ్చర్ ముడుపులు తీసుకుని ఇచ్చారంటున్న రుణాల కేసుల్లో కామత్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారాయన.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆర్థిక మంత్రిగా అనుభవజ్ఞులని పెట్టాలని కేంద్రం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవహారాల శాఖను నిర్మలకు కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్థిక మంత్రిగా వేరే వారిని నియమిస్తారా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 

Read: ఈ రాత్రికే భారత్ కు విజయ్ మాల్యా!