Big Boss 5: ముగిసిన లహరి జర్నీ.. వెక్కి వెక్కి ఏడ్చిన శ్వేతా!

బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల సందడికి మూడు వారాలు పూర్తయింది. ఒక్కో వారం ఒక్కొక్కరికి గుడ్ బై చెప్పేస్తున్నారు. తొలి రెండు వారాలు సరయు, ఉమాదేవి ఎలిమినేషన్ కాగా మూడవ వారం లహరి..

Big Boss 5: ముగిసిన లహరి జర్నీ.. వెక్కి వెక్కి ఏడ్చిన శ్వేతా!

Big Boss 5

Big Boss 5: బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల సందడికి మూడు వారాలు పూర్తయింది. ఒక్కో వారం ఒక్కొక్కరికి గుడ్ బై చెప్పేస్తున్నారు. తొలి రెండు వారాలు సరయు, ఉమాదేవి ఎలిమినేషన్ కాగా మూడవ వారం లహరి ఎలిమినేట్‌ అయింది. ఓటింగ్‌లో ఆమెకు తక్కువ ఓట్లు పడటంతో ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. నిజానికి ఈ వారం నామినేషన్స్‌ రసవత్తరంగా సాగింది. నామినేషన్స్ లోనే ప్రియ vs లహరి, రవిల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా.. ప్రియ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.

Big Boss 5: లేస్తే హగ్.. కూర్చుంటే హగ్.. పడుకుంటే హగ్.. బిగ్‌బాసంటే హగ్‌లేనా?

నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్న ఆసక్తి చివరి వరకూ కొనసాగగా ముందే అనుకున్నట్లుగానే లహరి హౌస్ నుండి బయటకొచ్చేసింది. ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉండగా ప్రియాంక సింగ్, శ్రీరామ్, మానస్ ముందే సేవ్ కాగా చివరికి ఇద్దరు మిగిలారు. అది కూడా అనుకున్నట్లుగానే ప్రియా, లహరిలలో ఒకరు ఎలిమేషన్ కావాల్సి వచ్చింది. సండే ఫన్‌డే అంటూ ఫన్నీ గేమ్స్ మొదలు పెట్టిన హోస్ట్ నాగ్ మ్యూజిక్ గేమ్ ఆడించాడు.

Big Boss 5: ఆ ఇద్దరితో లహరి బిజీ.. అగ్గిరాజేసిన ప్రియా కామెంట్స్

ఈ గేమ్ ముగిసిన తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. నామినేషన్‌లో ఉన్న మానస్, ప్రియ, లహరిని నిలబెట్టి ఎలిమినేషన్ ప్రక్రియలో కారు స్టీరింగ్‌ను చేతిలో పెట్టి.. ఎవరి చేతిలో ఉండగా యాక్సిడెంట్ అవుతుందో వారు అన్ సేఫ్ అవుతారు అని చెప్పారు. ముందుగా మానస్ సేఫ్ అనేసిన నాగ్ ప్రియ, లహరి షారి చేతిలో ఉండగా అన్ సేఫ్ అన్నారు. ఇక ఉత్కంఠ మొదలైంది. అయితే, నాగ్ మరో ఫన్ టాస్క్ మొదలుపెట్టాడు. ఇంటి సభ్యులతో కంటెస్టెంట్ కళ్లకు బ్లైండ్ ఫోల్డ్ తో టచ్ చేసి ఒక వస్తువును గుర్తించాలనే టాస్క్ ఆడించాడు.

Big Boss 5: ఏడుగురిని గొర్రెలుగా చేసిన హౌస్‌లోకి వచ్చిన ఓ గుంట నక్క!

అలా గేమ్ ముగించిన హోస్ట్ నాగార్జున మళ్లీ ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి చేతిలో రెండు లైట్లను తీసుకొచ్చి ఫైనల్ గా లహరిని ఎలిమినేషన్ చేసేశారు. ఎలిమినేషన్ తర్వాత ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా యాంకర్ రవి బాధలో మునిగిపోతే.. శ్వేతా వెక్కి వెక్కి ఏడ్చేసింది. అనంతరం సిరితో ఘాటు డిస్కషన్ కూడా చేసిన లహరి వేదిక మీద నుంచి మాట్లాడుతా అంటూ లహరి షారి ఘాటుగా స్పందిస్తూ ఇంటి సభ్యులకు వీడ్కోలు చెప్పి వేదిక మీదకు వచ్చారు.