Lata Mangeshkar: 12రోజులుగా ఐసీయూలో లతా మగేష్కర్

లెజెండరీ సింగర్ లతా మంగేశ్కర్ హెల్త్ లో ఎటువంటి సీరియస్ కండిషన్ లేకపోయినా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించడం లేదు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో జనవరి 9న అడ్మిట్ అయిన మంగేశ్కర్..

Lata Mangeshkar: 12రోజులుగా ఐసీయూలో లతా మగేష్కర్

Lata Mangeshkar Covid Positive (1)

Lata Mangeshkar: లెజెండరీ సింగర్ లతా మంగేశ్కర్ హెల్త్ లో ఎటువంటి సీరియస్ కండిషన్ లేకపోయినా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించడం లేదు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో జనవరి 9న అడ్మిట్ అయిన మంగేశ్కర్.. ‘ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. మా బెస్ట్ మేం ట్రై చేస్తున్నాం. త్వరలోనే కోలుకుంటారు’ అని ఆమెకు వైద్యం అందిస్తున్న డా. ప్రతీత్ సందానీ అన్నారు.

జనవరి 8న లెజండరీ సింగర్ లతా మంగేశ్కర్ కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ ఆమెను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లోని ఐసీయూలో అడ్మిట్ చేశారు.

రెండ్రోజుల క్రితం మంగేశ్కర్ బాగోలేదంటూ వచ్చిన వార్తలను అనూష శ్రీనివాసన్ అయ్యర్ అనే ప్రతినిధి ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు.

ఇది కూడా చదవండి : తొలి వన్డేలో భారత్ ఓటమి.. శార్దూల్ పోరాడినా…

‘తప్పుడు వార్తలు ప్రచారం అవుతుంటే చికాకుగా ఉంది. లతా గారి ఆరోగ్యం కుదుటగానే ఉంది. ఐసీయూలోనే వైద్యం కొనసాగిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అని చెప్పారు అనూష.

లతాను అంతా క్వీన్ ఆఫ్ మెలోడీ, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కొనియాడతారు. 1942 లోనే 13ఏళ్ల వయస్సులో ఆమె కెరీర్ ను మొదలుపెట్టారు. పలు భాషల్లో 30వేల పాటలు వరకూ పాడగలిగారు లతా మంగేశ్కర్.