Crazy Combinations: వావ్.. క్రేజీ కాంబినేషన్స్..!

ఓ వైపు మహేష్ - త్రివిక్రమ్, ఎన్టీఆర్ - కొరటాల వంటి హిట్ కాంబినేషన్స్ పట్టాలెక్కబోతుంటే.. మరోవైపు ఇంకొన్ని క్రేజీ కాంబోల నేమ్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో నిజమెంతో తెలియదు కానీ ఫ్యాన్స్‌కి మాత్రం పూనకాలొచ్చేస్తున్నాయి..

Crazy Combinations: వావ్.. క్రేజీ కాంబినేషన్స్..!

Latest Tollywood Crazy Combinations Rumours

Crazy Combinations: ఓ వైపు మహేష్ – త్రివిక్రమ్, ఎన్టీఆర్ – కొరటాల వంటి హిట్ కాంబినేషన్స్ పట్టాలెక్కబోతుంటే.. మరోవైపు ఇంకొన్ని క్రేజీ కాంబోల నేమ్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో నిజమెంతో తెలియదు కానీ ఫ్యాన్స్‌కి మాత్రం పూనకాలొచ్చేస్తున్నాయి. చిరు, పవన్, బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ వీళ్లతోనే అంటూ చక్కర్లు కొడుతున్న న్యూస్ పై ఓ లుక్కేద్దాం…

మెగాస్టార్ చిరంజీవి – సందీప్ రెడ్డి వంగా.. పరీక్షించి చూస్తే మ్యాచ్ అవదనిపించే కాంబో ఇది. కానీ వర్కౌట్ చేసే ప్రయత్నం నడుస్తోందని ఇన్ సైడ్ టాక్. స్వతహాగా చిరు ఫ్యాన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి. అందుకే ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం డైరెక్ట్‌గా చిరంజీవినే కలిశారని టాక్. సందీప్ స్టోరీ విన్న మెగాస్టార్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అంటున్నారు.

Chiranjeevi - Sandeep Reddy Vanga

తెలుగులో వైలెంట్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అదే సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ గా చూపించారు సందీప్ రెడ్డి. ప్రెజెంట్ రణ్ బీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. వన్స్ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే చిరు సినిమా వర్క్‌లో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇదే నిజమైతే, చిరు స్టైల్‌లో సందీప్ రెడ్డి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారా.. లేదంటే తన పవర్ ప్యాక్డ్ సబ్జెక్ట్‌‌లో మెగాస్టార్‌ను కొత్తగా చూపిస్తారా అన్నది హాట్ టాపిక్ అయింది.

Pawan Kalyan

 

ఇప్పుడంటే లాక్‌డౌన్ వచ్చింది కానీ వరుస సినిమాలతో తీరికలేకుండా గడిపారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కూడా హరీష్ శంకర్ వంటి డైరెక్టర్స్‌కి కమిట్‌మెంట్స్ ఇచ్చారు. అయితే ‘ఖిలాడి’ డైరెక్టర్ రమేష్ వర్మతో పవన్ ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాను పవన్ భక్తుడు బండ్ల గణేష్ నిర్మిస్తారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకడం ఈజీ కాదు. మరో 2 సంవత్సరాల వరకు పవన్ షెడ్యూల్ ఖాళీగా లేదు. అయినా సరే పవర్ స్టార్ – రమేష్ వర్మ – బండ్ల గణేష్ ప్రాజెక్ట్ డిటేల్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు.

Allu Arjun - Boyapati Sreenu

‘పుష్ప 2 పార్ట్స్’ తర్వాత బన్నీ ఏ డైరెక్టర్‌తో ముందుకొస్తారనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. కొరటాల కాంబోకి బ్రేక్ పడిన తర్వాత వేణూ శ్రీరామ్ అన్నారు.. తర్వాత ప్రశాంత్ నీల్ అన్నారు. మధ్యలో మురుగదాస్ పేరు కూడా వినిపించింది. కొత్తగా డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరపైకొచ్చాడు. ప్రస్తుతం బాలయ్యను ‘అఖండ’ గా చూపిస్తోన్న బోయపాటి నెక్ట్స్ బన్నీతోనే బరిలోకి దిగుతాడని టాక్. ఆల్రెడీ ఈ కాంబోలో ‘సరైనోడు’ వంటి బంపర్ హిట్ ఉంది. ఇక ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సబ్జెక్ట్‌కి కూడా బన్నీ ఫ్లాట్ అయ్యారని తెలుస్తోంది. మరి బోయపాటితోనా, గౌతమ్ తిన్ననూరితోనా? కాదంటే మరో దర్శకుడా.. అన్నది తెలియాల్సి ఉంది..