Leo Movie: విజయ్ లియో మూవీ కోసం స్పీడందుకున్న లోకేశ్ కనగరాజ్!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ ఇప్పటికే సినీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

Leo Movie: విజయ్ లియో మూవీ కోసం స్పీడందుకున్న లోకేశ్ కనగరాజ్!

Lokesh Kanagaraj Speeding Up For Vijay Leo Movie

Leo Movie: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ ఇప్పటికే సినీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

Leo Movie : ‘లియో’ సెట్స్ లోకి ఎంటర్ అయిన సంజయ్ దత్త్..

గతంలో విజయ్‌తో కలిసి ‘మాస్టర్’ సినిమాను తెరకెక్కించిన లోకేశ్, ఆ తరువాత లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా కమల్ హాసన్‌తో కలిసి ‘విక్రమ్’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, లోకేశ్ నెక్ట్స్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే విజయ్‌తో ‘లియో’ సినిమాను తెరకెక్కి్స్తున్న లోకేశ్, ఈ సినిమాను కూడా LCUలో భాగంగా తెరకెక్కిస్తున్నాడు.

Leo Movie: విజయ్ ‘లియో’ మూవీకి కళ్లు చెదిరే ఆఫర్.. కానీ పట్టించుకోని లోకేశ్!

ప్రస్తుతం కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ‘లియో’ మూవీ షెడ్యూల్‌ను ఈ వారం ముగించేందుకు లోకేశ్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ తరువాత కొంత బ్రేక్ తీసుకుని, ఆ నెక్ట్స్ షెడ్యూల్‌ను చెన్నైలో జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, అర్జున్, మాథ్యూ థామస్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.