Eatings Oats : త్వరగా బరువు తగ్గే ఆహారం కోసం వెతుకుతున్నారా…అయితే అలాంటి ఫుడ్ ఇదే..

త్వరగా బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో అర్ధంకాక సతమతమౌతున్నారు. అలాంటి వారు ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు.

10TV Telugu News

Eatings Oats : కరోనా కారణంగా చాలా మంది ఇంట్లోనే ఉండటం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోయారు. దీనికి కారణం శారీరక వ్యాయమం లేకపోవటంతోపాటు, ఇంటి వద్దే ఉండటం వల్ల అతిగా అహారం తీసుకోవటం. బరువు పెరగటం వల్ల ప్రస్తుతం కొన్ని రకాల వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. బరువు దగ్గించుకుంటే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవని హెచ్చిరిస్తున్నారు.

ఈక్రమంలో త్వరగా బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో అర్ధంకాక సతమతమౌతున్నారు. అలాంటి వారు ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు. ఓట్స్ మనదేశానికి చెందిన పంట కాదు. ఇది యూరప్ పశ్చిమాసియా దేశాల్లో విరివిగా పండుతుంది. ఓట్స్ లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. తక్షణ శక్తినిచ్చే గుణం ఓట్స్ కు ఉంది.

ఒకకప్పు ముడిఓట్స్ లో 307 క్యాలరీలు, 55గ్రాముల పిండిపదార్ధాలు, 8గ్రాముల ఫైబర్, 11 గ్రాముల ప్రొటీన్, 5గ్రాముల ఫ్యాట్, మెగ్నీషియం 27శాతం, సెలీనియం 43శాతం, భాస్వరం 27శాతం, పొటాషియం, 6శాతం, జింక్ 27శాతం ఉంటుంది. రాత్రి సమయంలో ఓట్స్ తీసుకోవటం వల్ల బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అదే క్రమంలో జీర్ణప్రక్రియ కూడా మెరుగవుతుంది. బిపీతోపాటు, షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.

ఫైబర్ ఎక్కవగా ఉండటం వల్ల త్వరగా ఆకలి అనిపించదు. అదనపు కొవ్వులను కరిగించే గుణం ఉండటంతో గుండెజబ్బుల వంటి సమస్యలు దరిచేరవు. ఉదయం అల్పాహారంగా, రాత్రి సమయంలో ఓట్స్ మీల్ గా తీసుకోవటం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి వివిధ రకాల్లో ఓట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఓట్స్ తీసుకునే సమయంలో అందులో ద్రాక్ష, దానిమ్మ, ఫైనాపిల్, జీడిపప్పు, బాదంపప్పులను కలుపుకుని తీసుకోవచ్చు. మనం ఇంట్లో వండుకునే కూరలను కూడా ఓట్స్ లో కలుపుకుని రుచికరంగా తినవచ్చు.

10TV Telugu News