Bunny Vasu : ప్రియదర్శి సినిమా అన్ని కోట్ల నష్టం తెచ్చిందట.. బన్నీవాసు కామెంట్స్ వైరల్..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ వాసు ఈ సినిమా లాస్ గురించి మాట్లాడాడు. (Bunny Vasu)
Bunny Vasu
Bunny Vasu : నిర్మాత బన్నీ వాసు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మరో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటితో కలిసి వరుసగా చిన్న సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ హిట్స్ కొట్టి ప్రాఫిట్స్ తెచ్చుకుంటున్నారు. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్ కొట్టారు.(Bunny Vasu)
ఇటీవల బన్నీ వాసు నిర్మాతగా, ప్రియదర్శి హీరోగా వచ్చిన మిత్ర మండలి సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ వాసు ఈ సినిమా లాస్ గురించి మాట్లాడాడు.
Also Read : Nagavamsi : నాకు తెలిసింది ఇద్దరు యాంకర్లే.. ఆ వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ..
బన్నీ వాసు మాట్లాడుతూ.. ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూసి మేము హ్యాపీగానే ఫీల్ అయ్యాము. మినిమమ్ సక్సెస్ అవుతుంది అనుకున్నాము. కానీ థియేటర్స్ లో ఫెయిల్ అయింది. ఏదో మిస్ అయింది. ఏం మిస్ అయిందో తెలీదు. నేను ఫైనల్ కాపీ కూడా చూసుకోలేదు. నేను బిజీగా ఉండి ఫైనల్ కాపీ చూడకుండా రిలీజ్ చేసాము. అది ఒక తప్పు. సినిమాలో ప్రేక్షకులు నవ్వుతారు అనుకున్న సీన్స్ కి నవ్వలేదు. ఆ సినిమాకు అందరికి కలిపి 6 కోట్ల నష్టం వచ్చింది అని తెలిపాడు.
