Shafali Verma : శ్రీలంకతో ఐదో టీ20 మ్యాచ్.. షఫాలీ వర్మ 75 రన్స్ చేస్తే ప్రపంచ రికార్డు..
శ్రీలంకతో ఐదో టీ20 మ్యాచ్‌లో షఫాలీ వర్మ (Shafali Verma) 75 రన్స్ చేస్తే ప్రపంచ రికార్డును సృష్టిస్తుంది.
INDw vs SLW 5th T20 Shafali Verma need 75 runs to most runs in a womens t20 series (PIC Credit@BCCIWomen)
Shafali Verma : భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు (మంగళవారం డిసెంబర్ 30) ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma ) ను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ఒకవేళ షపాలీ ఈ మ్యాచ్‌లో 75 పరుగులు సాధిస్తే ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంటుంది.
మహిళల అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. ఈ క్రమంలో ఆమె వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ హేలీ మాథ్యూస్‌ను అధిగమిస్తుంది. ఓ టీ20 సిరీస్‌లో మాథ్యూస్ 310 పరుగులు చేసింది. లంకతో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో షపాలీ 236 పరుగులు సాధించింది.
వాస్తవానికి తొలి మ్యాచ్‌లో 9 పరుగులకే షపాలీ ఔట్ అయింది. అయితే.. ఆ తరువాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగింది. వరుసగా 69*, 79*, 79 పరుగులు సాధించింది.
మహిళల అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు వీరే..
* హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) – 3 మ్యాచ్‌ల్లో 310 పరుగులు
* చమరి ఆటపట్టు (శ్రీలంక) – 5 మ్యాచ్‌ల్లో 304 పరుగులు
* మరియా కాస్టినేరాస్ (అర్జెంటీనా) – 3 మ్యాచ్‌ల్లో 300 పరుగులు
* సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 4 మ్యాచ్‌ల్లో 297 పరుగులు
