బిగ్గరగా మాట్లాడినా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది, సైంటిస్టుల వార్నింగ్

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా

  • Published By: naveen ,Published On : May 19, 2020 / 03:30 AM IST
బిగ్గరగా మాట్లాడినా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది, సైంటిస్టుల వార్నింగ్

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలీదు. కరోనా వైరస్ తీరు తెలుసుకోవడానికి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలా నిశితంగా దాన్ని స్టడీ చేస్తున్నారు. ఈ స్టడీలో రోజుకో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా గురించి భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి.

బిగ్గరగా మాట్లాడటం ద్వారా కరోనా వ్యాప్తి:
కరోనా వైరస్ అనేక మార్గాల్లో వ్యాపిస్తుందనే విషయం అందరికి తెలుసు. కరోనా వైరస్ ఏయే మార్గాల్లో వ్యాపిస్తుంది అనేదానిపై ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. దగ్గు, తుమ్మడం ద్వారా వచ్చే నీటి బిందువుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలుసు. అలాగే శ్వాసతో కూడా. తాజాగా బిగ్గరగా మాట్లాడటం ద్వారా కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందగల సామర్థ్యం ఉందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మాట్లాడే సమయంలో ఏర్పడే సూక్ష్మ నీటి బిందువుల ద్వారా గాల్లోకి కరోనా వైరస్ వ్యాప్తి చెంది దాదాపు 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంటుందని స్టడీ వెల్లడించింది. దగ్గరగా ఉన్న వ్యక్తుల నుంచి మాట్లాడటం ద్వారా కూడా కొవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతుందని journal of National Academy of Sciences పరిశోధకులు చెబుతున్నారు. 

బిగ్గరగా మాట్లాడినప్పుడు నోటి నుంచి వెయ్యికిపైగా నీటి బిందువులు విడుదల:
బిగ్గరగా మాట్లాడటం ద్వారా చిన్న చిన్న శ్వాసకోశ బిందువులు నోటి నుంచి విడుదల అవుతాయి. అవి గాల్లో 8 నిమిషాల వరకు ఉంటాయి. ఆ నీటి బిందువులే కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. నర్సింగ్‌ హోమ్‌లు, సమావేశాలు, ఇళ్లు మొదలైన వాటిలో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందడానికి గల కారణాన్ని వివరించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇందుకోసం వారు ఓ లేజర్ లైట్ వాడారు. ఒక వ్యక్తి మాట్లాడే సమయంలో నోటి నుంచి ఎన్ని తుంపర్లు విడుదల అవుతాయో లెక్క కట్టారు. బిగ్గరగా మాట్లాడినప్పుడు నోటి నుంచి సెకనుకి 1,000 కంటే ఎక్కువ నీటి తుంపర్లు విడుదల అవుతాయని గుర్తించారు.

గాలిలో 8 నిమిషాలు పాటు సజీవంగా నోటి తుంపర్లు:
లాలాజలంలో ఉండే కరోనావైరస్ పరిగణనలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు.. ప్రతి నిమిషం బిగ్గరగా మాట్లాడటం వలన దగ్గరగా ఉన్న ప్రదేశంలో ఎనిమిది నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం గాలిలో ఉండిపోయే సామర్థ్యం  ఉందని గుర్తించారు. దక్షిణ కొరియాలోని కాల్ సెంటర్, రద్దీగా ఉండే చైనీస్ రెస్టారెంట్‌లో అధ్యయనాలు జరిపిన తరువాత, కరోనా వైరస్ నోటి నుంచి వచ్చే నీటి బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతుందనే అనుమానం కలిగింది. మొత్తంగా బిగ్గరగా మాట్లాడటం వల్ల ఎక్కువ బిందువులను ఉత్పత్తి చేస్తుందని అధ్యయనంలో తేలింది. అలాగే గాలిలో ఎక్కువసేపు ఉండగల సామర్ధ్యం కలిగిన చిన్న బిందువులు విడుదల అవుతాయని తెలిసింది. ఒక నిమిషం పాటు బిగ్గరగా మాట్లాడినా సుమారు వెయ్యి నీటి బిందువులు విడుదల అవుతాయి. అవే కరోనా వ్యాప్తికి కారణం అవుతాయని అధ్యయనంలో తేలింది. ఆ బిందువలు పదుల నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు గాల్లోనే ఉండిపోతాయని, పరిమిత ప్రదేశాలలో వైరస్ వ్యాప్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అని పరిశోధకులు తేల్చారు. అదే సమయంలో తక్కువ బిగ్గరగా మాట్లాడటం ద్వారా తక్కువ నీటి తుంపర్లను ఉత్పత్తి చేస్తుందని, ఇది కొంతవరకు ప్రమాదం తగ్గినట్టే అని అదే బృందం తేల్చింది. 

మాట్లాడే సమయంలో మాస్క్ మస్ట్:
మొత్తంగా బిగ్గరగా మాట్లాడటం అనేది ప్రమాదకరం అని అధ్యయనంలో తేలింది. ఇది కరోనా వ్యాప్తికి కారణం అవుతోంది అనే విషయం వెలుగుచూసింది. అందుకే ఇక పై బిగ్గరగా మాట్లాడకపోవటమే మంచిదని పరిశోధకలు అంటున్నారు. అంతేకాదు మాట్లాడే సమయంలో కచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించడం చాలా ఉత్తమం అని సూచిస్తున్నారు.

Read: మాట్లాడటం ద్వారా కూడా కరోనావైరస్ వేగంగా సోకుతుంది : సైంటిస్టుల హెచ్చరిక