Love Today : లవ్‌టుడే హిందీ రీమేక్.. అమీర్ ఖాన్ తనయుడితో జాన్వీ కపూర్ చెల్లెలు రొమాన్స్?
గతంలోనే లవ్‌టుడే సినిమాని హిందీలో రీమేక్ చేస్తారని ప్రకటించారు. హిందీ రీమేక్ హక్కులను ఫ్యాంటమ్ స్టూడియోస్ దక్కించుకుంది. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు.
Love Today Remake : తమిళ్ లో ప్రదీప్ రంగనాధన్(Pradeep Ranganathan) హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా లవ్‌టుడే. ఇవానా(Ivanaa) హీరోయిన్ గా నటించగా సత్యరాజ్, రాధికా ముఖ్య పాత్రలు పోషించారు. 5 కోట్లతో చిన్న సినిమాగా తెరకెక్కిన లవ్‌టుడే దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమాని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా భారీ విజయం సాధించి కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమాతో ప్రదీప్, ఇవానా ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
అయితే గతంలోనే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తారని ప్రకటించారు. హిందీ రీమేక్ హక్కులను ఫ్యాంటమ్ స్టూడియోస్ దక్కించుకుంది. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాని కొత్తవాళ్ళతోనే తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిద్దామని ముందు నుంచి అనుకున్నారు. పలు పేర్లు అనుకున్నా తాజాగా వినిపించిన పేర్లు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ ముఖ్య పాత్రల్లో లవ్‌టుడే రీమేక్ ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. జునైద్ ఖాన్ కి ఇదే మొదటి సినిమా అవుతుంది. ఖుషి కపూర్ తన మొదటి సినిమా ది ఆర్చీస్ లో నటిస్తుంది. ఈ సంవత్సరం ఆ సినిమా రిలిజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత లవ్‌టుడే హిందీ రీమేక్ లో నటిస్తుందని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా బాలీవుడ్ లో వీరిద్దరితోనే లవ్‌టుడే రీమేక్ చేస్తారని టాక్ నడుస్తుంది.
Karthi : జపాన్ మేడ్ ఇన్ ఇండియా.. కామెడీ విలన్ గా కార్తీ గ్లింప్స్ రిలీజ్..
బాలీవుడ్ వాళ్ళు గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాలను రీమేక్ చేసి ఫ్లాప్స్ చూస్తున్నారు. ఆ సినిమాల్లో వాటి ఒరిజినాలిటీని పోగొడుతున్నారు. దీనిపై విమర్శలు వస్తున్నా బాలీవుడ్ ఇంకా సౌత్ రీమేక్స్ ఆపట్లేదు. మరి లవ్‌టుడే లాంటి మంచి సినిమాని హిందీలో ఎలా రీమేక్ చేస్తారో చూడాలి. తమిళ్ ప్రేక్షకులైతే ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసి చెడగొట్టొద్దని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.