LPG prices: రూ.100 పెరగనున్న ఎల్పీజీ ధరలు.. వారికి మాత్రమే
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డిసెంబర్ 1 బుధవారం నుంచి ఎల్పీజీ సిలిండర్లపై రూ.100 ధర పెంచనున్నాయి. 19కేజీల బరువు ఉండే కమర్షియల్ సిలిండర్ ధర నవంబర్ 1 తర్వాత మరోసారి డిసెంబర్ 1న...

Lpg Commercial Gas Cylinder Price Hike In Delhi
LPG prices: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డిసెంబర్ 1 బుధవారం నుంచి ఎల్పీజీ సిలిండర్లపై రూ.100 ధర పెంచనున్నాయి. 19కేజీల బరువు ఉండే కమర్షియల్ సిలిండర్ ధర నవంబర్ 1 తర్వాత మరోసారి డిసెంబర్ 1న పెంచనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2వేల 101గా ఉండగా ముంబైలో రూ.2వేల 51గా ఉంది. పెరిగిన తర్వాత ధరలు దాదాపు రూ.2వేల 200వరకూ చేరిందన్నమాట. కోల్‌కతా, చెన్నైలలో వాటి ధర రూ.2వేల 174, రూ.2వేల 234గా ఉంది.
ఇదిలా ఉంటే డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. నాన్ సబ్సీడీ 14.2 కేజీల సిలిండర్ ధర రూ.899.50గా ఉంది. 5కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.502గా ఉంది. ఎల్పీజీ ధరలు నెలకొకసారి రివైజ్ చేసి అవసరాన్ని బట్టి మార్పులు చేస్తారు.
……………………………………… : కంగనా రనౌత్ కు చంపేస్తామంటూ బెదిరింపులు