KKR vs LSG: కోల్‌క‌తాతో మ్యాచ్‌.. కొత్త జెర్సీలో ల‌క్నో

కొత్త రంగు జెర్సీను ల‌క్నో జ‌ట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా ఆవిష్క‌రించాడు. మెరూన్, ఆకుప‌చ్చ కాంబినేష‌న్‌లో ఈ జెర్సీ ఉంది.కేకేఆర్‌తో మ్యాచ్‌లో ల‌క్నో ప్లేయ‌ర్లు ఈ కొత్త జెర్సీ ధ‌రించి ఆడ‌నున్నారు.

KKR vs LSG: కోల్‌క‌తాతో మ్యాచ్‌.. కొత్త జెర్సీలో ల‌క్నో

LSG new jersey

LSG new jersey: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants) దూసుకుపోతుంది. గాయాల కార‌ణంగా కీల‌క ఆట‌గాళ్లు దూరం అయిన‌ప్ప‌టికి స‌మిష్టిగా రాణిస్తుంది. 15 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. త‌న చివ‌రి లీగ్ మ్యాచ్‌ను ఈడెన్ గార్డెన్ వేదిక‌గా మే 20న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌(Kolkata Knight Riders)తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండానే ల‌క్నో ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.

ఈ కీల‌క మ్యాచ్‌లో ల‌క్నో జెర్సీ మార‌నుంది. ఈ విష‌యాన్ని త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌గా ల‌క్నో వెల్ల‌డించింది. ఫుట్‌బాల్ దిగ్గజానికి నివాళిగా, లెజెండరీ ఇండియన్ ఫుట్‌బాల్ క్లబ్ మోహన్ బగాన్ నుండి ప్రేరణ పొందిన జెర్సీని ధరించనుంది. కొత్త రంగు జెర్సీను ల‌క్నో జ‌ట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా ఆవిష్క‌రించాడు. మెరూన్, ఆకుప‌చ్చ కాంబినేష‌న్‌లో ఈ జెర్సీ ఉంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ల‌క్నో ప్లేయ‌ర్లు ఈ కొత్త జెర్సీ ధ‌రించి ఆడ‌నున్నారు. సాధార‌ణంగా లక్నో సూపర్ జెయింట్స్ నీలం రంగు (ముదురు మరియు లేత నీలం) ధరిస్తారు అన్న సంగ‌తి తెలిసిందే.

IPL 2023 playoffs: ప్లే ఆఫ్స్ రేసును ర‌స‌వత్త‌రంగా మార్చిన లక్నో విజ‌యం

ల‌క్నో యజమాని, కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా 2020లో మోహన్ బగాన్ ఫుట్‌బాల్ విభాగంలో 80 శాతం వాటాను కొనుగోలు చేశారు. 2020/21 ఇండియన్ సూపర్ లీగ్ (ISL) సీజన్‌కు ముందు జట్టును ATK మోహన్ బగాన్‌గా పేరు మార్చారు. మూడు సీజన్ల తర్వాత క్లబ్ మ‌రోసారి పేరు మారుస్తున్నారు. జూన్ 1 నుండి క్లబ్‌ను మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్ అని పిల‌వ‌నున్నారు.

ఇక ల‌క్నో, కేకేఆర్ మ్యాచ్‌కు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన సంబంధం ఉంది. కోల్‌క‌తా జ‌ట్టుకు రెండు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను అందించిన గౌత‌మ్ గంభీర్ ప్ర‌స్తుతం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. గ‌తేడాది నుంచి గంభీర్ ఈ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో కేకేఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచులు ఆడింది. ఆరు మ్యాచుల్లో గెలిచి 12 పాయింట్ల‌తో ఏడో స్థానంలో కొన‌సాగుతోంది. ల‌క్నోతో ఆడేది లీగ్ ద‌శ‌లో చివ‌రి మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజ‌యం సాధించిన ఫ్లే ఆఫ్స్‌కు చేర‌డం చాలా క‌ష్టం. ఎందుకంటే కేకేఆర్ నెట్ ర‌న్‌రేట్ మైన‌స్‌లో ఉండ‌డ‌మే కార‌ణం.

IPL 2023: ఆర్‌సీబీకి చావోరేవో.. గ‌తం హైద‌రాబాద్‌కు అనుకూలం.. అంద‌రి క‌ళ్లు కోహ్లిపైనే