Lyca Productions : మలయాళ దర్శకుడితో తమిళ్ నిర్మాణ సంస్థ సినిమా.. ఆ ఇద్దరు హీరోలే..
మలయాళ స్టార్ డైరెక్టర్ తో తమిళ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఈ మూవీలో హీరోలుగా..

Lyca Productions announce their next collobaration with Jude Anthany Joseph
Lyca Productions : ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇప్పటికే కమల్ హాసన్‌తో ఇండియన్ 2, రజినీకాంత్‌తో లాల్ సలాం సినిమాలను రెడీ చేస్తుంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసేసింది. ఈ ఏడాది మలయాళంలో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించిన ‘2018’ చిత్రాన్ని తెరకెక్కించిన జూడ్ ఆంథని జోసెఫ్ తో తమ కొత్త సినిమాని ప్రకటించింది.
Genie : జయం రవి కొత్త మూవీ ‘జీని’ ఓపెనింగ్ ఈవెంట్లో మెరిసిన అందాల భామలు..
దర్శకుడితో సినిమా ప్రకటించిన లైకా ప్రొడక్షన్స్.. హీరో ఎవరు అన్నది మాత్రం తెలియజేయలేదు. అయితే తమిళనాట మాత్రం ఈ సినిమాలో నటించబోయేది ఒక హీరో కాదు ఇద్దరు హీరోలు అంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. జూడ్ ఆంథని దర్శకుడిగా పరిచయం చేసిన మలయాళ హీరో నివిన్ పౌలీ (Nivin Pauly) ఒక హీరోగా కనిపించబోతుంటే, మరో హీరో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కూడా ఇందులో భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది. దీని గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుందని సమాచారం.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి విడాకుల వార్తలు.. జనసేన రియాక్షన్ ట్వీట్..
ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. కాగా 2018 సినిమా లాగా ఈ చిత్రాన్ని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు రెడీ చేస్తున్నాడట. అలాగే ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ భాషలతో పాటు ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, లైకా నిర్మిస్తున్న ఇండియన్ 2 రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ వీడలేదు. దీంతో కమల్ హాసన్ అభిమానులు రిలీజ్ పై క్లారిటీ ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఈ మూవీ పై అవుట్ ఫుట్ పై కమల్ అండ్ డైరెక్టర్ శంకర్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట.
We are excited & thrilled ? about this collaboration with the most happening director ? #JudeAnthanyJoseph for our upcoming project! ?✨ pic.twitter.com/ORQVMPCWCv
— Lyca Productions (@LycaProductions) July 5, 2023