Hyderabad : హైదరాబాద్‌‌లో స్వల్ప భూకంపం

Hyderabad : హైదరాబాద్‌‌లో స్వల్ప భూకంపం

Hyd

Magnitude 4 Earthquake : తెలంగాణ రాష్ట్రంలో భూంకంప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు కొంత భయాందోలనలకు గురయ్యారు. హైదరాబాద్ సమీపంలో స్వల్ప భూకంపం సంభవించింది. 2021, జూలై 26వ తేదీ సోమవారం ఉదయం 5 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతుతో ప్రకంపనలు వచ్చాయని వెల్లడించింది.

Read More : Covid In Children : చిన్నారులపై కరోనా పంజా.. వందలాది మంది పిల్లలు బలైపోతున్నారు!

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్‌, ఉప్పునూత మండలాల్లో సోమవారం ఉదయం 5 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. స్వల్ప భూకంపం కావడంతో ఊపిరిపీల్చుకున్నారు.