Lucky Draw for Vaccinated: వ్యాక్సిన్ వేసుకుంటే లక్కీ డ్రాలో ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, టీవీలు ఇస్తోన్న గవర్నమెంట్

కొవిడ్ వ్యాప్తిని అరికట్టే దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. లక్కీ డ్రా ఏర్పాటు చేసింది. అందులో గెలుచుకున్న వారికి ఎల్ఈడీ టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు...

Lucky Draw for Vaccinated: వ్యాక్సిన్ వేసుకుంటే లక్కీ డ్రాలో ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, టీవీలు ఇస్తోన్న గవర్నమెంట్

Lucky Draw

Lucky Draw for Vaccinted: కొవిడ్ వ్యాప్తిని అరికట్టే దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. లక్కీ డ్రా ఏర్పాటు చేసింది. అందులో గెలుచుకున్న వారికి ఎల్ఈడీ టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు బహుమతిగా ఇస్తుంది. ఎవరైతే స్వచ్ఛందంగా ప్రభుత్వం నడుపుతున్న వ్యాక్సినేషన్ సెంటర్లకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటారో వారే దీనికి అర్హులు.

అది కూడా నవంబర్ 12 నుంచి 24వ తేదీ మధ్యలో వచ్చిన వారికి మాత్రమే బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుందని మహారాష్ట్రలోని చంద్రపూర్ మునిసిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. మేయర్ రాఖీ సంజయ్ కంచర్లవర్ నేతృత్వంలో జరిగిన మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మీటింగ్ జరిగిన తర్వాత సివిక్ కమిషనర్ రాజేశ్ మొహితె ఇతర అధికారులు దగ్గర్లోని ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. నవంబర్ 12 నుంచి 24వ తేదీ మధ్యలో వేసుకున్న వారు.. పేర్లను రిజిష్ట్రర్ చేయించుకోవాలని.. లక్కీ డ్రాలో గెలిచిన వారికి ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు, ఎల్ఈడీ టీవీలు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లుగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

.…………………………………………… : కేసీఆర్ వల్లే నూతన ట్రైబ్యునల్ ఆలస్యం : షెకావత్

 

అవేకాకుండా 10మందిని ఎంపిక చేసి మిక్సర్ గ్రైండర్లు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. చంద్రపూర్ సిటీ మొత్తంలో ఇప్పటివరకూ లక్షా 93వేల 581మంది తొలి డోస్ వేయించుకున్నారు. వారిలో 99వేల 620మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. సిటీలో ఉన్న జనాభా కంటే వ్యాక్సిన్ వేసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.