Trees Translocation: 100 ఏళ్ల నాటి 4 చెట్లను యధావిధిగా తరలించిన మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు

మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం..100 ఏళ్ల నాటి నాలుగు వేప చెట్లను స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుండి కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్‌కు తరలించారు

Trees Translocation: 100 ఏళ్ల నాటి 4 చెట్లను యధావిధిగా తరలించిన మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు

Trees

Updated On : April 17, 2022 / 5:32 PM IST

Trees Translocation: చెట్టు ఎంతో విలువైంది. మొక్కగా ఎదిగి మానుగా మారి..సమస్త ప్రాణకోటికి ప్రాణవాయువును అందిస్తుంది చెట్టు. అటువంటి చెట్లను..స్వార్ధపరులైన కొందరు..నరికివేస్తున్నారు. ఒక భారీ చెట్టు పూర్తిగా ఎదిగేందుకు సుమారు 15 నుంచి 20 సంవత్సరాల కాలం పడుతుంది. కానీ చెట్టును కూల్చేందుకు నిముషం కూడా పట్టదు. ఈ విషయాన్నీ బాగా అర్ధం చేసుకున్న మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు..చెట్టును నరికివేయకుండా..కూకటివేళ్లతో సహా మరో ప్రాంతానికి తరలించారు. చెట్లను కాపాడాలన్న ఒక వినూత్న చొరవతో ముందుకు వచ్చిన మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం..100 ఏళ్ల నాటి నాలుగు వేప చెట్లను స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుండి కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్‌కు తరలించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ ఉన్న ప్రాంతంలో..సమీకృత మాంస విక్రయశాలలు, కూరగాయల మార్కెట్‌ నిర్మాణం జరుగుతుంది.

Also read:Honour Killing : భువనగిరి పరువు హత్యకేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

దీంతో గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న చెట్లను తొలగించాల్సి వచ్చింది. నాలుగు భారీ చెట్లను నరికివేయడం ఇష్టంలేని అధికారులు..ఆమేరకు చెట్లను ఒక చోట నుంచి మరో చోటకి తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. స్వచ్చంద సంస్థ వాత ఫౌండేషన్ సహకారంతో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్‌ వెంకట్‌రావు పర్యవేక్షణలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ చెట్ల తరలింపు జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు పట్టణంలోని ఇతర స్వచ్చంద సంస్థల సహకారంతో చెట్లను తరలించారు. చెట్ల తరలింపుపై ఎంపీ సంతోష్ కుమార్ స్పందిస్తూ..ప్రకృతిని కాపాడుతూనే జిల్లాలో అభివృద్ధి పనులు జరుగున్నాయంటూ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. వంద ఏళ్ల నాటి ఈ వృక్షాల తరలింపుపై పట్టణ వాసులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also read:Bandi sanjay : మంత్రిపై హత్య కేసు నమోదు చేయాలి: బండి సంజయ్