Wine Shop Names: మద్యం దుకాణాలకు దేవుళ్ళు, జాతీయ నాయకుల పేర్లు పెట్టరాదు: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఇకపై రాష్ట్రంలో మద్యం దుఖాణాలు, బార్లకు దేవుళ్ళు, దేవతల పేర్లు, జాతీయ నాయకుల పేర్లు, ఇతర సాంప్రదాయ కట్టడాల పేర్లు పెట్టరాదని సీఎం ఉద్ధవ్ థాక్రే ఆదేశాలు జారీచేశారు

Wine Shop Names: మద్యం దుకాణాలకు దేవుళ్ళు, జాతీయ నాయకుల పేర్లు పెట్టరాదు: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

Wines

Wine Shop Names: మద్యం దుకాణాలకు పేర్లు పెట్టె అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో మద్యం దుఖాణాలు, బార్లకు దేవుళ్ళు, దేవతల పేర్లు, జాతీయ నాయకుల పేర్లు, ఇతర సాంప్రదాయ కట్టడాల పేర్లు పెట్టరాదని సీఎం ఉద్ధవ్ థాక్రే ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఉన్న పేర్లను కూడా అధికారికంగా మార్చుకునేందుకు జూన్ 30 వరకు గడువు విధించింది ప్రభుత్వం. ఆమేరకు దేవుళ్ళు, దేవతలు, ప్రముఖ సాధువులు, పరిపాలన ద్వారా జాబితా చేయబడిన 56 జాతీయ నాయకుల పేర్లు మరియు రాష్ట్రంలోని 105 చారిత్రక కోటల పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. జాబితాలో ఉన్న పేర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం దుకాణాలకు పెట్టరాదని సూచించిన ప్రభుత్వం..ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు..సదరు మద్యం దుకాణం లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించింది. మద్యం విక్రయశాలలకు ఆయా పేర్లు పెట్టడం వల్ల వాటి పవిత్రత సన్నగిల్లుతోందని, సామాజిక, మతపరమైన వాతావరణాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Also read:Kishan Reddy On Paddy : అప్పుడు మీటర్లు, ఇప్పుడు వడ్లు.. టీఆర్ఎస్ రాద్దాంతం చేస్తోందన్న కిషన్ రెడ్డి

మద్యం దుఖాణాలకు దేవుళ్ళ పేర్లు, మతపరమైన పేర్లు పెట్టడం ద్వారా మన సాంప్రదాయాన్ని మనమే కించపరుచుకున్నట్లుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. “మన చారిత్రక కోటలు సువర్ణ చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి, వాటి పవిత్రతను కాపాడుకోవాలి. మద్యం దుకాణాలకు పేర్లు పెట్టడం వలన సామాజిక, మత, ఆధ్యాత్మిక భావాలను దెబ్బతీస్తుంది అంటూ”మహారాష్ట్ర నేతలు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే మద్యం దుకాణాలపై దేవుళ్ళ పేర్లు తొలగించే విషయంపై..రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి ఎన్నో రోజులుగా వస్తున్న సూచన. దీనిపై మద్యం దుకాణాలకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. చివరకు ప్రధాన దేవుళ్ళు, దేవతలు, ప్రముఖ మఠాధిపతులు, సాధువులు, చారిత్రక కట్టడాల పేర్లు, జాతీయ పోరాటయోధుల పేర్లను సూచిస్తూ జాబితా సిద్ధం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం..ఆ జాబితా ప్రకారం మద్యం దుకాణాలకు సూచనలు చేసింది.

Also read:Viral Video : శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న కోతి-వైరల్ వీడియో

నిషేధించబడిన పేర్ల జాబితా:
ఛత్రపతి శివాజీ వంటి భారతీయ పోరాటయోధుల పేర్లు, మహాత్మా ఫూలే మరియు సావిత్రీబాయి ఫూలే వంటి సామాజిక కార్యకర్తలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి రాజకీయ ప్రముఖులు, CM ఉద్ధవ్ థాకరే తండ్రి మరియు తాత, బాల్ థాకరే మరియు కేశవ్ థాకరేల పేర్లు, మరియు హిందూత్వ సిద్ధాంతకర్త వి. సావర్కర్..మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు మన్మోహన్ సింగ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ మరియు ప్రణబ్ ముఖర్జీ సహా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. నిషేదిత పేర్ల జాబితాలో కొన్ని కోటల పేర్లు ఉన్నాయి. ముంబైలోని సియోన్, ధారవి, మాహిమ్ మరియు వర్లీ కోటలు వంటి కోటలు ఈజాబితాలో ఉన్నాయి.

Also read:Sri lanka crisis : చేతులెత్తేసిన శ్రీలంక.. 51 బిలియన్ డాలర్ల విదేశీ అప్పులు తీర్చలేమని వెల్లడి..