Sri lanka crisis : చేతులెత్తేసిన శ్రీలంక.. 51 బిలియన్ డాలర్ల విదేశీ అప్పులు తీర్చలేమని వెల్లడి..

పొరుగు దేశమైన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటి వరకు ఎదుర్కోనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఆ దేశం ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఆ దేశ ప్రభుత్వం మంగళవారం సంచలన ...

Sri lanka crisis : చేతులెత్తేసిన శ్రీలంక.. 51 బిలియన్ డాలర్ల విదేశీ అప్పులు తీర్చలేమని వెల్లడి..

Srilanka

Sri lanka crisis : పొరుగు దేశమైన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటి వరకు ఎదుర్కోనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఆ దేశం ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఆ దేశ ప్రభుత్వం మంగళవారం సంచలన ప్రకటన చేసింది. దేశ ఖజానా దివాలా తీసిందని, ఈ క్రమంలో 51 బిలియన్ డాలర్ల విదేశీ అప్పులను తీర్చలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మరోవైపు దేశంలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆందోళనకు బౌద్ధగురువులు మద్దతు తెలిపారు.

Srilanka Crisis: మా దేశాన్ని ఆదుకోండి మహాప్రభో: ప్రధాని మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత అభ్యర్థన

ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని మహింద రాజపక్స ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న సమయంలో కొవిడ్ లాక్ డౌన్ కారణంగా విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించాయని ప్రధాని పేర్కొన్నాడు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేస్తుందని రాజపక్స తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడం వల్ల నగదు కొరత ఎదుర్కొంటున్న మన దేశానికి ఆర్థిక సాయం అందకుండా పోతుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

Sri Lanka Crisis : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఎఫెక్ట్.. 26 మంది మంత్రుల రాజీనామా ..

దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అధ్యక్షుడితో కలిసి ప్రతిక్షణం పనిచేస్తున్నామని మహింద్ర రాజపక్స తెలిపారు. ప్రజలు ఆందోళన బాట పట్టడం వల్ల ప్రస్తుతమున్న పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంటుంది తప్ప ఆర్థిక సంక్షోభం నుండి బయటపడలేమని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఆందోళనలు విరమించాలని శ్రీలంక ప్రధాని కోరారు.