Srilanka Crisis: మా దేశాన్ని ఆదుకోండి మహాప్రభో: ప్రధాని మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత అభ్యర్థన

తీవ్ర ఆర్ధిక మాంద్యంలో చిక్కుకుని, ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని స్థితిలో ఉన్న తమ దేశాన్ని ఆదుకోవాలంటూ శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాసా ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్ధించా

Srilanka Crisis: మా దేశాన్ని ఆదుకోండి మహాప్రభో: ప్రధాని మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత అభ్యర్థన

Sajith

Srilanka Crisis: కనీవినీ ఎరుగని రీతిలో శ్రీలంక దేశం తీవ్ర ఆర్ధిక మాంద్యంలో చిక్కుకుంది. ధరల మాట దేవుడెరుగు అసలు దేశంలో బియ్యం, మంచి నీరు, విద్యుత్ వంటి కనీస అవసరాలు కూడా ప్రస్తుతం లంక ప్రజలకు అందుబాటులో. ఆహార పదార్ధాలు అందుబాటులో ఉన్నా..ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో అవి ఎంతవరకు ప్రజల అవసరాలు తీరుస్తాయనే విషయం మాత్రం తెలియడంలేదు. శ్రీలంకలో నెలకొన్న తీవ్ర సంక్షోభంపై చేతులెత్తేసిన కేబినెట్ మంత్రులు 26 మంది మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దీంతో శ్రీలంక దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశంలోని అన్ని రాజకీయ పార్టీలని కేబినెట్లోకి ఆహ్వానించారు. దేశాన్ని ప్రజలను కాపాడడంలో ప్రతిపక్ష నేతలకు మంత్రి పదవులు సైతం అప్పగిస్తామని అధ్యక్షుడు ప్రకటించారు. ఇదిలాఉంటే తీవ్ర ఆర్ధిక మాంద్యంలో చిక్కుకుని, ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని స్థితిలో ఉన్న తమ దేశాన్ని ఆదుకోవాలంటూ శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాసా భారత ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్ధించారు. ఇది తమ మాతృ భూమి అని ఇక్కడి నుంచి మరెక్కడికి వెళ్లలేమని..మా దేశాన్ని మీరే ఆదుకోవాలంటూ” సాజిత్ ప్రేమదాసా అభ్యర్ధించారు.

Also Read:AP BJP: ఎల్లుండి నుంచి బీజేపీ ఉత్తరాంధ్ర పాదయాత్ర

శ్రీలంక ఆర్ధిక, ఆహార సంక్షోభాన్ని అధిగమించేలా సాధ్యమైనంత వరకు భారత్ తమకు సహాయం చేయాలనీ ప్రేమదాసా అభ్యర్ధించారు. సోమవారం ANI మీడియాతో మాట్లాడిన సాజిత్ ప్రేమదాసా..”దేశాన్ని ఆదుకుంటున్నట్టుగా డ్రామాలాడిన అధికార పార్టీ..ప్రజలను నిలువునా మోసం చేసిందని, సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేలా, ప్రజలకు ఉపశమనం కలిగించడానికి అధికార ప్రభుత్వం చిత్తశుద్ధి, నిజమైన ప్రయత్నం చేయలేదని” సాజిత్ ప్రేమదాసా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నికలు వస్తాయా అన్న విలేకర్ల ప్రశ్నకు సాజిత్ బదులిస్తూ..తాము ఎన్నడూ సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.

Also read:China Covid : చైనాలో కరోనా విలయతాండవం.. కొత్తగా 16వేలకు పైగా కేసులు, ఇదే అత్యధికం..!