Maharashtra: ఇత‌ర రాష్ట్రాల ఎమ్మెల్యేలూ వ‌చ్చి అసోంలో ఉండొచ్చు: సీఎం హిమంత

'అసోంలో మంచి హోట‌ళ్లు ఉన్నాయి. ఎవ‌రైనా రావ‌చ్చు.. ఇక్క‌డి గ‌డిపి వెళ్లొచ్చు. ఇందులో ఏ స‌మ‌స్య ఉండ‌దు. మ‌హారాష్ట్ర ఎమ్మెల్యేలు అసోంలోని హోట‌ల్‌లోనే ఉన్నారా? లేదా? అన్న విష‌యం గురించి నాకు తెలియ‌దు. ఇత‌ర రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా అసోంకు వ‌చ్చి ఉండొచ్చు' అని హిమంత బిశ్వ‌శ‌ర్మ ఢిల్లీలో మీడియాకు చెప్పారు.

Maharashtra: ఇత‌ర రాష్ట్రాల ఎమ్మెల్యేలూ వ‌చ్చి అసోంలో ఉండొచ్చు: సీఎం హిమంత

Assam Cm Himanta Biswa Sharma

Maharashtra: మహారాష్ట్ర నుంచి దాదాపు 40 మంది ఎమ్మెల్యేల‌తో అసోంలోని గువాహ‌టిలోని ఓ హోట‌ల్‌లో శివ‌సేన అసంతృప్త‌ నేత‌, మంత్రి ఏక్‌నాథ్ షిండే ఉంటోన్న నేప‌థ్యంలో దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంపై అసోం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ స్పందించారు. దీని గురించి త‌న‌కు ఏమీ తెలియ‌దు అన్న‌ట్లు మాట్లాడారు.

Maharashtra: 12 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని శివ‌సేన పిటిష‌న్

‘అసోంలో మంచి హోట‌ళ్లు ఉన్నాయి. ఎవ‌రైనా రావ‌చ్చు.. ఇక్క‌డి గ‌డిపి వెళ్లొచ్చు. ఇందులో ఏ స‌మ‌స్య ఉండ‌దు. మ‌హారాష్ట్ర ఎమ్మెల్యేలు అసోంలోని హోట‌ల్‌లోనే ఉన్నారా? లేదా? అన్న విష‌యం గురించి నాకు తెలియ‌దు. ఇత‌ర రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా అసోంకు వ‌చ్చి ఉండొచ్చు’ అని హిమంత బిశ్వ‌శ‌ర్మ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. కాగా, ఏక్‌నాథ్ షిండే శివ‌సేన‌కు షాక్ ఇవ్వ‌డంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం పతనం అంచుకు చేరుకుంది. ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న ఉత్కంఠ నెల‌కొంది. ఏక్ నాథ్ షిండే వర్గానికి బలం పెరుగుతోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశానికి కూడా చాలా తక్కువ మంది శివసేన ఎమ్మెల్యేలు వచ్చారు.