Maharashtra: రేపు బ‌ల‌ప‌రీక్ష‌.. నేడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న మ‌హారాష్ట్ర కేబినెట్‌

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రేపు బ‌ల‌ప‌రీక్ష ఎదుర్కొనే అవ‌కాశం ఉండ‌గా, నేడు ఆ రాష్ట్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే నేతృత్వంలో కేబినెట్ స‌మావేశ‌మైంది. ఔరంగాబాద్ పేరును సాంబాజీన‌గ‌ర్‌గా మార్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

Maharashtra: రేపు బ‌ల‌ప‌రీక్ష‌.. నేడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న మ‌హారాష్ట్ర కేబినెట్‌

Uddav

Maharashtra: మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రేపు బ‌ల‌ప‌రీక్ష ఎదుర్కొనే అవ‌కాశం ఉండ‌గా, నేడు ఆ రాష్ట్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే నేతృత్వంలో కేబినెట్ స‌మావేశ‌మైంది. ఔరంగాబాద్ పేరును సాంబాజీన‌గ‌ర్‌గా మార్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎన్నో ఏళ్ళుగా ఔరంగాబాద్ పేరును మార్చాల‌ని డిమాండ్ ఉంది. మ‌హారాష్ట్ర స‌ర్కారు దీనిపై నేడు నిర్ణయం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. అలాగే, నావీ ముంబైలోని కొత్త విమానాశ్ర‌యానికి డీబీ పాటిల్ పేరు పెట్టాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది.

Maharashtra: రేపు బ‌ల‌ప‌రీక్ష.. మీ తీరు సరికాదు: సీఎం ఉద్ధ‌వ్‌కు గ‌వ‌ర్న‌ర్ లేఖ‌

అంతేగాక‌, ఉస్మానాబాద్‌కు ధారాశివ్‌గా పేరు మార్చాల‌ని కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. కాగా, కేబినెట్ భేటీ అనంత‌రం మీడియా ముందు రెండు చేతులు జోడించి ఉద్ధ‌వ్ ఠాక్రే అభివాదం చేశారు. ఆయ‌న రాజీనామా చేయ‌బోతున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మరోవైపు, మ‌హావికాస్ అఘాడీ ప్ర‌భుత్వం పత‌నం అంచుకు చేరుకున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేకు గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారీ లేఖ రాసి, రేపు బ‌ల‌ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని చెప్పారు.