Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఏప్రిల్ సెంటిమెంట్.. హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తాడా?

సినిమా ఇండస్ట్రీలో డేట్ సెంటిమెంట్‌కి ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొబ్బరికాయ కొట్టే నుంచి గమ్మడికాయ కొట్టే వరకు..

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఏప్రిల్ సెంటిమెంట్.. హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తాడా?

Sarkaru

Sarkaru Vaari Paata: సినిమా ఇండస్ట్రీలో డేట్ సెంటిమెంట్‌కి ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొబ్బరికాయ కొట్టే నుంచి గమ్మడికాయ కొట్టే వరకు.. సినిమాని థియేటర్లో విడుదల చేసేవరకు సెంటిమెంట్ ప్రకారం.. ప్రతీపనిని చేస్తూ ఉంటారు సినిమా వాళ్లు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఏప్రిల్‌లో విడుదలైన సినిమాలు అన్నీ ఇండస్ట్రీ హిట్ కొడుతాయని, మేలో సినిమాలు ఫ్లాప్ అవుతాయని..

లేటెస్ట్‌గా సర్కారువారి పాట జనవరి నుంచి ఏకంగా నాలుగు నెలలు వెనక్కి వెళ్లిపోయింది. సినిమా విడుదల లేట్ అవుతున్నా కూడా మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉండడగానికి కారణం ఏప్రిల్ సెంటిమెంట్. ఏప్రిల్‌లో విడుదలైన ‘పోకిరి’ బ్లాక్ బస్టర్ అయ్యి.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తర్వాత ఏప్రిల్‌లో విడుదలైన ‘భరత్ అనే నేను’ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

కానీ మే లో విడుదలైన సినిమాలు మహేష్‌కు చేదు జ్ఞాపకాలే ఎక్కువ మిగిల్చాయి.. మహేష్ బాబుకు నంది అవార్డు తెచ్చిపెట్టినా కూడా తేజ దర్శకత్వంలో నటించిన ‘నిజం’ సినిమా మే నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన ‘నాని’ సినిమా కూడా మే నెలలో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తర్వాత మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా మేలోనే విడుదలైంది. అయితే, మహర్షి సినిమా మాత్రం మేలో విడుదలై హిట్ అయ్యింది.

ఇప్పుడు పరశురామ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారువారి పాట’ 2022 ఏప్రిల్‌ 1న విడుదల కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది. దీంతో ‘పోకిరి’, ‘భరత్ అనే నేను’ సినిమాల తర్వాత హ్యాట్రిక్ హిట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.