Major: ఓవర్సీస్‌లో మైల్‌స్టోన్ మార్క్ దిశగా మేజర్

టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘మేజర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా....

Major: ఓవర్సీస్‌లో మైల్‌స్టోన్ మార్క్ దిశగా మేజర్

Major Inching Toward Million Dollar Mark In Us

Major: టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘మేజర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించగా, ఇందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు రిపీటెడ్ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Major: మేజర్ 3 రోజుల వసూళ్లు.. ఎంతంటే?

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా కూడా మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకెళ్తోంది. తమిళ చిత్రం విక్రమ్ గట్టి పోటీనిస్తున్నా కూడా మేజర్ సినిమా తన ఆడియెన్స్‌ను కోల్పోకుండా నిలబడింది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. అయితే ఈ చిత్రం ఓవర్సీస్ ఆడియెన్స్‌ను కూడా మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. అక్కడా ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తోంది. వీక్ డేస్‌లోనూ ఈ సినిమాకు ఆడియెన్స్ తాకిడి తగ్గకపోవడంతో ఈ సినిమా ఇప్పటికే 900 డాలర్లకు పైగా వసూళ్లతో దుమ్ములేపుతోంది.

Major: మేజర్ టీమ్‌కు హ్యాట్సాఫ్..!

ఈ వారం ముగిసేలోపే మేజర్ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ముంబై దాడులను కళ్లకు కట్టినట్లుగా చూపించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్, శోభిత దూళిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి మేజర్ చిత్రం టోటల్ రన్‌లో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.