Manchu Manoj : మీ ఫ్యామిలిలో అందరు గొప్పవాళ్లే మీరు తప్ప.. నాగబాబు పై మంచు మనోజ్ కౌంటర్

మంచు మనోజ్ మాట్లాడుతూ.. ''హయ్యర్ పర్పస్ లేని వ్యక్తులకు ఏం చేయాలో తెలియదు. ఎప్పుడూ పక్క వారి మీద పడతారు. వారికంటూ ఓ లక్ష్యం, గమ్యం ఉండవు. పోటీ అంటే రెండు పక్కలుంటాయి. ఒకరిద్దరు....

Manchu Manoj : మీ ఫ్యామిలిలో అందరు గొప్పవాళ్లే మీరు తప్ప.. నాగబాబు పై మంచు మనోజ్ కౌంటర్

Manoj

Manchu Manoj :  ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అన్నట్టు జరిగాయి. మంచు విష్ణుకి మద్దతుగా కొంతమంది నిలబడగా, ప్రకాష్ రాజ్ కి నాగబాబుతో పాటు మరికొంతమంది మద్దతుగా నిలిచారు. అయితే ఈ టైం లో నాగబాబు మంచు ఫ్యామిలీపై, విష్ణు పై పలు విమర్శలు చేశారు. వ్యక్తిగత విమర్శలకి కూడా పాల్పడ్డారు. ఇక మంచు విష్ణు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు బాగా ట్రోల్ అయ్యాయి. ఎన్నికల అనంతరం మంచు విష్ణు గెలుపొందారు. ఆ తర్వాత కూడా కొన్ని సార్లు నాగబాబు మంచు ఫ్యామిలీపై ఇండైరెక్ట్ గా విమర్శలు చేశారు.

 

తాజాగా ఇప్పుడు మరోసారి ‘మా’ ఎన్నికల వ్యవహారం తెర మీదకు వచ్చింది. దానికి కారణం మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలే. ఇటీవల మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలను శ్రీవిద్యానికేతన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి పలువురు ప్రముఖులు కూడా విచ్చేసి మాట్లాడారు. ఇందులో భాగంగానే మంచు మనోజ్ కూడా మాట్లాడుతూ నాగబాబు పేరు ఎత్తకుండా పరోక్షంగా సెటైర్లు వేశాడు.

Anushka Sharma : నిర్మాతగా సెలవు.. ఇకపై నా దృష్టంతా యాక్టింగ్ పైనే

మంచు మనోజ్ మాట్లాడుతూ.. ”హయ్యర్ పర్పస్ లేని వ్యక్తులకు ఏం చేయాలో తెలియదు. ఎప్పుడూ పక్క వారి మీద పడతారు. వారికంటూ ఓ లక్ష్యం, గమ్యం ఉండవు. పోటీ అంటే రెండు పక్కలుంటాయి. ఒకరిద్దరు ఉంటారు. ఇటు పక్క వెళ్లి ఓట్లు వేయమని అడిగారు. అటుపక్క ఓట్లు వేయమని అడిగారు. ఫలానా వ్యక్తి గెలిస్తే బాగుంటుందని జనాలందరూ అనుకున్నారు. మా అన్నను గెలిపించారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇండస్ట్రీ అందరూ ఫ్రెండ్సే. ఎవరికి ఎవరం హానీ చేసుకోం.”

RRR : చెర్రీ, తారక్‌లతో కలిసి నాటు నాటు స్టెప్ వేసిన అమీర్.. వైరల్ అవుతున్న వీడియో..

”కానీ ఒక వ్యక్తి మాత్రం మా అన్నని టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడదామని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. అయినా మా అన్న పట్టించుకోలేదు. నాన్న గారు కూడా పట్టించుకోలేదు. మాకు సపోర్ట్ చేసిన వాళ్లని పెద్ద పెద్ద వాళ్లని కూడా బూతులు తిట్టాడు. అది మీ అందరూ చూశారు. వాళ్లెందుకు అలా చేశారని ఆలోచించాను. వాళ్లకు హయ్యర్ పర్పస్ లేదు వదిలేయ్ పాపం అని నాన్న గారు అన్నారు. కరెక్టే కదా? అని అనిపించింది. తరువాత నేను ఆయన గురించి ఆలోచించాను. అతని చుట్టూ గొప్పగొప్ప వాళ్లున్నారు. వాళ్ళ ఫ్యామిలిలో హయ్యర్ పర్పస్ కోసం జీవించేవాళ్లున్నారు. జనాల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్నవాళ్లున్నారు. కానీ ఆయనకు మాత్రం అలాంటిది ఏదీ లేదు” అని ఇండైరెక్ట్ గా నాగబాబు పేరెత్తకుండా కౌంటర్లు వేశాడు. మరి దీనికి నాగబాబు ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.