Anushka Sharma : నిర్మాతగా సెలవు.. ఇకపై నా దృష్టంతా యాక్టింగ్ పైనే

తాజాగా అనుష్క నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపింది. ఈ సందర్భంగా అనుష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్ లో అధికారిక పోస్ట్ పెట్టింది. ''ప్రస్తుతం నేను గృహిణిగా, నటిగా రెండు....

Anushka Sharma : నిర్మాతగా సెలవు.. ఇకపై నా దృష్టంతా యాక్టింగ్ పైనే

Anushka

 

Anushka Sharma :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ విరాట్ తో పెళ్లి తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే సినిమాలకి దూరమైన తర్వాత నిర్మాణంలోకి అడుగుపెట్టింది అనుష్క. తన బ్రదర్ కర్నేష్ శర్మతో కలిసి క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ సంస్థని స్థాపించింది. ఈ సంస్థలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించింది. క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ పతాకంపై అనుష్క నిర్మించిన ‘ఎన్‌.హెచ్‌.10’, ‘ఫిల్లౌరి’ ‘పాతాళ్‌ లోక్‌’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి.

 

అయితే తాజాగా అనుష్క నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపింది. ఈ సందర్భంగా అనుష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్ లో అధికారిక పోస్ట్ పెట్టింది. ”ప్రస్తుతం నేను గృహిణిగా, నటిగా రెండు బాధ్యతల్ని నిర్వహిస్తున్నాను. అందువల్ల మిగతా పనులకి సమయం కేటాయించలేకపోతున్నాను. క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ నిర్మాణ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నాను. ఇప్పటి వరకు మంచి సినిమాలని అందించాము. ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు. ఇకపై ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలు మా బ్రదర్ కర్నేష్ శర్మ చూసుకుంటారు. నేను సినీ నిర్మాణం నుంచి తప్పుకుంటున్నాను. జీవితాన్ని బ్యాలెన్స్‌ చేద్దామనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇక నుంచి నా మొదటి లవ్ నటనకే పూర్తి సమయాన్ని కేటాయిస్తాను” అని అనుష్కశర్మ తెలిపింది.

RRR : చెర్రీ, తారక్‌లతో కలిసి నాటు నాటు స్టెప్ వేసిన అమీర్.. వైరల్ అవుతున్న వీడియో..

ఇన్ని రోజులు పెళ్లి, కూతురు బాధ్యలతో సినిమాలకి దూరంగా ఉంది. ప్రస్తుతం అనుష్క, విరాట్ ల కూతురు వామికకి సంవత్సరం నిండింది. దీంతో అనుష్క శర్మ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తుంది అనుష్క. మరికొన్ని కథలు వింటుంది.