Manipur : అమిత్ షా చెప్పులు వేసుకోవచ్చు గానీ..స్థానిక నేతలు బూట్లు వేసుకోకూడదా..? : రాహుల్ గాంధీ

అమిత్ షాను కలవానికి వెళ్లిన నేతలతో బయటే బూట్లు విప్పించారని..అమిత్ షా చెప్పులు వేసుకోవచ్చు గానీ..స్థానిక నేతలు బూట్లు వేసుకోకూడదా..? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

Manipur : అమిత్ షా చెప్పులు వేసుకోవచ్చు గానీ..స్థానిక నేతలు బూట్లు వేసుకోకూడదా..? : రాహుల్ గాంధీ

Manipur (1)

Manipur : మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో బీజేపీ గెలుపు కోసం అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చారు. దీంట్లో భాగంగా కీలక నేత అమిత్ షా మణిపూర్ లో మకాం వేశారు. ఈక్రమంలో మణిపూర్ కు చెందిన బీజేపీ నేతలు కొంతమంది ఆయనను కలవటానికి వెళ్లారు. ఈసందర్భంగా అమిత్ షాను కలివాలంటే నేతల వారి బూట్లు విప్పి రావాలనే నిబంధన పెట్టారట. దీంతో షాను కలవటానికి వెళ్లిన నేతలు బూట్లు విప్పి లోపలికి వెళ్లారట. దీనిపై కాంగ్రెస్ నేతల రాహుల్ గాంధీ మండిపడ్డారు.

అమిత్ షా చెప్పులు వేసుకోవచ్చుగానీ..ఆయన్ని కలవటానికి వెళ్లే నేతలు మాత్రం బూట్లు విప్పాలా? అంటూ ప్రశ్నించారు. మణిపుర్‌కు చెందిన నాయకులు కొందరు కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అమిత్‌ షాను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు వారితో బయటే బలవంతంగా బూట్లు విప్పించి వారిని అవమానపరిచారని రాహుల్‌ గాంధీ ఆరోపిస్తు వారికి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మత సంప్రదాయాలపై “దాడి” అంటూ ఆరోపించారు.

నేతలు బూట్లు విప్పి లోపలికి వెళ్లి చూస్తే అమిత్‌ షా చెప్పులు ధరించి ఉన్నారని ఆ నేతలు చెప్పారని..హోంమంత్రిని కలవటానికి వెళితే తమకు జరిగిన అవమానం గురించి ఆవేదనతో తనకు చెప్పారని రాహుల్ గాంధీ వెల్లడించారు. అమిత్‌ షా చెప్పులు ధరించి ఉన్నప్పుడు మణిపుర్‌ నేతలు బూట్లు ఎందుకు వేసుకోకూడదు? అని రాహుల్‌ ప్రశ్నించారు.

ఇక్కడే తెలుస్తోంది షా ఇతరులకంటే తాను అధికుడిననీ..గొప్పవాడిననే అభిప్రాయం బయటపడుతోందని విమర్శించారు. ఈ ఘటనపై అమిత్‌ షా క్షమాపణ చెప్పాలని రాహుల్‌ గాంధీ బుధవారం (ఫిబ్రవరి 2,2022) లోక్‌సభలో డిమాండ్‌ చేశారు.

రాహుల్ గాంధీ డిమాండ్ కు బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ సంప్రదాయాలు తెలియకుండా మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగారు.దీంతో రాహుల్ గాంధీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మణిపూర్ లో జరిగిన ఘటనకు తన వద్ద రుజువు ఉందని రాహుల్‌ ధీమాగా బీజేపీ సభ్యుల్ని ఎదుర్కొన్నారు. దానికి బీజేపీ నేతలు ఒకరు పాద రక్షలు వేసుకొని…ఇతరులను వాటిని ధరించ వద్దని ఆదేశించడం సంప్రదాయం ఎలా అవుతుందని రాహుల్‌ ప్రశ్నించారు.