Manoj Tiwary: క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి

తన కెరీర్ లో 2008 నుంచి 2015 మధ్య 12 అంతర్జాతీయ వన్డేలు, మూడు టీ20లు ఆడారు మనోజ్. ఓ వన్డేలో సెంచరీ, మరో వన్డేలో హాఫ్ సెంచరీ బాదారు.

Manoj Tiwary: క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి

Manoj Tiwary

Manoj Tiwary – Cricket: క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మనోజ్ తివారి (37) ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. తనను కష్ట కాలంలో క్రికెట్‌ ఆదుకుందని అన్నారు. తాను క్రికెట్ కు ఎంతో రుణపడి ఉన్నానని తెలిపారు. టీమిండియా (Team India) జాతీయ జట్టులో అతడు చివరిసారిగా 2015లో ఆడారు.

తన కెరీర్ లో 2008 నుంచి 2015 మధ్య 12 అంతర్జాతీయ వన్డేలు, మూడు టీ20లు ఆడారు మనోజ్. ఓ వన్డేలో సెంచరీ, మరో వన్డేలో హాఫ్ సెంచరీ బాదారు. సామాజిక మాధ్యమాల్లో ద్వారా తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రిగా మనోజ్‌ తివారి కొనసాగుతున్నారు.

గత రంజీ సీజన్‌లో పశ్చిమ బెంగాల్ ఫైనల్‌ వరకు వెళ్లడంలో తివారి కీలక పాత్ర పోషించారు. రాజకీయాల్లో ఉంటూనే దేశవాళీ టోర్నీల్లో ఆయన ఆడడం గమనార్హం. 2018 ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి మనోజ్ ప్రవేశించారు. చివరి వన్డే జింబాబ్వేతో 2015 జులై 10న ఆడారు.

టీ20లో తొలి మ్యాచు ఇంగ్లండ్ తో 2011 అక్టోబరు 29న ఆడారు మనోజ్. న్యూజిలాండ్ తో 2012 సెప్టెంబరు 11న ఆడిన టీ20 చివరిది. వన్డేల్లో మొత్తం 287, టీ20ల్లో 15 పరుగులు చేశారు. ఐపీఎల్‌లో 2008 నుంచి 2018 వరకు ఆడారు. మొత్తం 98 మ్యాచులు ఆడి 1,695 పరుగులు చేశారు.
BJP MP Brij Bhushan : లైంగిక వేధింపుల కేసే కాదు బ్రిజ్ భూషణ్ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ విచారణ