NCDRC : ఫోన్ వేడెక్కుతోంది..రూ. 743 కోట్లు ఇవ్వండి

అసత్య ప్రచారం కంపెనీ చేసిందని కొన్న ఫోన్ కు రూ. 9 వేల 119, కోర్టు, రవాణా ఖర్చులకు గాను రూ. లక్ష, ఆర్థికంగా, న్యాయపరంగా రూ. 743 కోట్లు చెల్లించేలా మొబైల్ కంపెనీని ఆదేశించాలని కోరారు

NCDRC : ఫోన్ వేడెక్కుతోంది..రూ. 743 కోట్లు ఇవ్వండి

Mobile

Misleading Advertisement : మనిషి ఆశకు అంతుండదు. కొంతమందికి అధికంగా డబ్బులు, ఆస్తులున్నా..ఇంకా కావాలని కోరుకుంటుంటారు. ఇలాగే..ఓ వ్యక్తి…ఓ కంపెనీ నుంచి అత్యంత భారీ మొత్తం పరిహారంగా ఇప్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ..జాతీయ వినియోగదారుల వివాదా పరిష్కార కమిషన్ ను కోరాడు. అభ్యర్థనను పరిశీలించిన అధ్యక్షులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

Read More : shortest cow Rani Died : ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు ‘రాణి’ మృతి

ఢిల్లీలో నివాసం ఉండే ఓ వ్యక్తి 2016లో సెల్ ఫోన్ కొన్నాడు. సెల్ ఫోన్ కు ఏదైనా అయితే..సదరు కంపెనీ నుంచి..సులువుగా డబ్బులు వెనక్కి వచ్చే సదుపాయం ఉందా ? లేదా ? అని అనేక వెబ్ సైట్లు చూశాడు. తర్వాతే కొన్నాడు. కొన్ని రోజులకు ఫోన్ వెడెక్కడం మొదలైంది. దీంతో ఆ కంపెనీని సంప్రదించాడు. 16 రోజుల క్రితం నిబంధనలు మారాయి. డబ్బులు వెనక్కి ఇవ్వలేమని..కొత్త ఫోన్ ఇస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. నిబంధనలు మార్చేస్తే..ఎలా ? మేం చూస్తూ ఊరుకోవాలా ? అంటూ…ప్రశ్నిస్తూ…జాతీయ వినియోగదారుల వివాదా పరిష్కార కమిషన్ (NCDRC)ని ఆశ్రయించారు.

Read More :Maidaan : రిలీజ్ డేట్ మళ్లీ మారింది..

అసత్య ప్రచారం కంపెనీ చేసిందని..కొన్న ఫోన్ కు రూ. 9 వేల 119, కోర్టు, రవాణా ఖర్చులకు గాను రూ. లక్ష, ఆర్థికంగా, న్యాయపరంగా తనకు జరిగిన నష్టానికి గాను రూ. 743 కోట్లు చెల్లించేలా మొబైల్ కంపెనీని ఆదేశించాలని కోరారు. ఈ అభ్యర్థనను NCDRC అధ్యక్షులు ఆర్.కె.అగర్వాల్, సభ్యుడు ఎస్.ఎం.కాంతికర్ లు పరిశీలించి..తోసిపుచ్చారు. సెప్టెంబర్  22వ తేదీ బెంచ్ పలు ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ వాయిస్ బిల్లులను మళ్లీ ముద్రించాలని సూచించారు. ఫోన్ విలువ రూ. 9 వేల 119 మాత్రమే ఉందని, అందువల్ల ఫిర్యాదును స్వీకరించడానికి కమిషన్ కు అధికారం లేదని తెలిపారు. కొంతమంది ఫోన్ లు వాడుతున్నారని, వాటిని తిరిగి ఇచ్చేయడం వంటివి చేయడం వల్ల..దుర్వినియోగం కారణంగా రిటర్న్ పాలసీని మార్చినట్లు పేర్కొంది. ఈ కామర్స్ కంపెనీ తన రిటర్న్ పాలసీలో మార్పుపై వార్తా పత్రికలు, ఆన్ లైన్ పోర్టల్ లో ఇంగ్లీషు, స్థానిక భాషల్లో ప్రచురించినట్లు కమిషన్ వెల్లడించింది.