shortest cow Rani Died : ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు ‘రాణి’ మృతి

ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవుగా గుర్తింపు పొందిన ‘రాణి’ మృతి చెందింది. 51 సెంటీమీటర్ల ఎత్తుతో మరుగుజ్జు రాణి సెలెబ్రిటీ అయిపోయింది. ఈక్రమంలో అందాల రాణి అనారోగ్యంతో మృతి చెందింది.

shortest cow Rani Died : ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు ‘రాణి’ మృతి

Shortest Cow Rani Died (1)

shortest cow Rani passes away : ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవుగా గుర్తింపు పొందిన ‘రాణి’ మృతి చెందింది. 23 నెలల రాణి ఎత్తు 51 సెంటీమీటర్లు మాత్రమే. ఈ మరుగుజ్జు రూపమే దాన్ని సెలెబ్రిటీని చేసింది. బుట్టి జాతికి చెందిన ఈ రాణిని చూడటానికి జనాలు భారీగా తరలి వచ్చేవారు. దాంతో సెల్ఫీలు తీసుకునేవారు.దాన్ని చూసి మురిసిపోయేవారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దగ్గరలోని చారిగ్రామ్కు చెందిన ఎమ్ఎ హాసన్ హవాల్దార్ ఈ ఆవును పెంచుకుంటున్నాడు. రాణిని చూడటానికి నిత్యం వేల సంఖ్యలో జనం క్యూ కట్టేవారు. హాసన్ కు ఇటువంటి పొట్టి ఆవులు ఇంకా ఉన్నాయి. కానీ రాణి మాత్రం వాటికంటే పొట్టిది. రాణి ఎత్తు కేవలం 51 సెం.మీటర్లు, బరువు 26 కేజీలు. ఏడాది పాప నిలబడితే ఆ పాపకంటే తక్కువగా ఉండేదీ రాణి ఆవు.

రాణి మరణంతో యజమాని హాసన్ ఆవేదన వ్యక్తంచేశారు. నా బుజ్జి రాణి ఎంతోమందిని ఆకట్టుకుంది. రాణికి ప్రపంచ గుర్తింపు కోసం గిన్నిస్ రికార్డు వాళ్లను సంప్రదించామని..గిన్నిస్ బుక్ ప్రతినిధులు మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు..కానీ ఇంతలోనే ఇలా రాణి మాకు దూరంకావటం ఎంతో బాధగా ఉందని తెలిపారు. రాణి పెద్దగా తినేది కాదు..కొంచం గడ్డి తింటే చాలు దాని కడుపు నిండిపోయేది అంతే..భలే యాక్టివ్ గా ఉండేది. దాన్ని సరదాగా బయటకు తీసుకెళ్లితే లేడిపిల్లలాగా గెంతులు వేసేది. సంతోషంగా ఉండేది. దాన్ని చూసి ముచ్చటపడి దాన్ని ఎవరైనా చేతుల్లోకి ఎత్తుకుంటే మాత్రం దానికి నచ్చేది కాదు గింజుకుని కిందకు దూకేసేది అంటూ హాసన్ రాణి గుర్తులను జ్ఞాపకం చేసుకుని ఆవేదన వ్యక్తంచేశారు.

Read more : Most Expensive Pet : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే!

రాణి గడ్డితినేది కాదు. దీంతో పశువుల హాస్పిటల్ కు తీసుకెళ్లగా దానికి కడుపులో కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యిందని తెలిపారు. వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు.రాణిని రక్షించటానికి డాక్టర్లు ఎంతగా యత్నించినా.. అలా బుజ్జి ఆవు రాణి ఆగస్టు 19 2021న ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు.

ప్రపంచంలో అత్యంత పొట్టి ఆవుగా గిన్నిస్ రికార్డుకెక్కిన కేరళకు చెందిన మాణిక్యం అనే ఆవు కంటే రాణి 10 సెంటీమీటర్లు పొట్టిది. దీంతో హాసన్ రాణిని చూడటానికి జనాలు కరోనా లాక్ డౌన్ ను కూడా లెక్కచేయకుండా వచ్చేవారు. రాణితో సెల్ఫీలు తీసుకునేవారు. కానీ రాణికి దిష్టి తగులుతుందని జనాలకు ఆపటానికి ఎంతగానో యత్నించేవాళ్లం.కానీ సాధ్యమయ్యేది కాదు. ఎంతో ఆశగా రాణిని చూడటానికి వచ్చేవాళ్లను కంట్రోల్ చేయలేకపోయేవారు.

Read more : Woman Scarf Made with Dogs Fur : పెంపుడు కుక్క‌ల బొచ్చుతో స్కార్ఫ్‌..మెడలో వేసుకుని మురిసిపోతున్న యజమాని

కాగా బుట్టి జాతికి చెందిన ఆవులు చాలా పొట్టిగా ఉంటాయి. కానీ రాణి వాటికంటే పొట్టిది కావటంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. కొన్ని రోజులు బ్రతికి ఉంటే గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కేదే. కాగా బుట్టి ఆవులకు చెందిన పశువులున్ని మాంసం విక్రయాల కోసం పెంచుతారు. కానీ ఈ రాణిని కూడా మాంసం కోసం అమ్మేస్తారేమోనని రాణి అభిమానులు ఆందోళన వ్యక్తంచేసేవారు.

అదే విషయాన్ని రాణి యజమాని హాసన్ ను అడిగేవారు దాన్ని చూడటానికి వచ్చినవారు. కానీ హాసన్ మాత్రం ఇంత అందమైనా నా ‘రాణి’ని మాంసం కోసం అమ్మటమా..అలా ఎప్పటికీ చేయను. నా రాణి అందరినీ ఎంతో ఇష్టమైన రాణిగా మారిపోయింది. ఆ ఆనందాన్ని నేను దూరం చేయను అంటూ హానస్ దాన్ని ప్రాణంగా చూసుకునేవారు.కానీ రాణి మరణంతో యజమాని హాసన్ తో పాటు రాణి అభిమానులంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Read more : Woman Scarf Made with Dogs Fur : పెంపుడు కుక్క‌ల బొచ్చుతో స్కార్ఫ్‌..మెడలో వేసుకుని మురిసిపోతున్న యజమాని