Hyderabad Traffic : హైదరాబాద్‌‌లో మారథాన్..ట్రాఫిక్ ఆంక్షలు, ఎక్కడెక్కడంటే

పీపుల్స్ ప్లాజా - నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర వివిధ రహదారులపై మారథాన్ కొనసాగనుంది.

Hyderabad Traffic : హైదరాబాద్‌‌లో మారథాన్..ట్రాఫిక్ ఆంక్షలు, ఎక్కడెక్కడంటే

Trafic

Marathon In Hyderabad : హైదరాబాద్ లో మారథాన్ సందర్భంగా..ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇందులో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయాన్నే ఆంక్షలు విధించడంతో వాహదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పీపుల్స్ ప్లాజా – నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర వివిధ రహదారులపై మారథాన్ కొనసాగనుంది. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్ లు పీపుల్స్ ప్లాజా నుంచి మొదలయ్యాయి. 10 కిలీమీటర్ల మారథాన్ అన్ హైటెక్స్ ఎన్ఏసీ మెయిన్ గేట్, మాదాపూర్ నుంచి ప్రారంభమైంది.

Read More : Bedroom : నవ వధువు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి వాటికోసం వెతికిన పోలీసులు

ట్రాఫిక్ ఆంక్షలు :-

జూబ్లీహిల్స్ నుంచి కావూరి హిల్స్ మీదుగా…ఇనార్బిట్ మాల్ వైపు వచ్చే వాహనదారులు సైబర్ టవర్స్, ఐకియా రోటరీ, ఇనార్బిట్ మాల్, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి ORR వైపుకు మళ్లిస్తారు.
జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలను మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్, ఐకియా అండర్‌పాస్, బయో డైవర్సిటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి ORR వైపు మళ్లించనున్నారు.
మెహిదీపట్నం – ORR నుంచి వచ్చే వాహనాలు…గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్, రాడిసన్ జంక్షన్, బొటానికల్ జంక్షన్, మసీదు గ్రామం మీదుగా లింగంపల్లి వైపు మ‌ళ్లిస్తారు.

Read More : Tamil Nadu : రోడ్డు ప్రమాద బాధితులకు తొలి 48 గంటలు ఉచిత చికిత్స

గచ్చిబౌలి, ORR, శంషాబాద్, మెహదీపట్నం, కొండాపూర్ నుంచి వచ్చే వాహనాలు జీపీఆర్ఏ క్వార్టర్స్, గోపిచంద్ అకాడమి వైపు మళ్లిస్తారు. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలు…విప్రో జంక్షన్‌ నుంచి నానక్‌రామ్‌గూడ, ఓఆర్‌ఆర్‌ గచ్చిబౌలి మీదుగా వెళాల్సి ఉంటుందని వెల్లడించారు.
కొండాపూర్, కొత్తగూడ నుంచి వచ్చే వాహనాలు…బొటానికల్ జంక్షన్ మీదుగా మసీదు బండ, హెచ్‌సియు డిపో – లింగంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇంద్రానగర్ నుండి మెహిదీపట్నం వైపు వచ్చే వాహనాలు GPRA క్వార్టర్స్ గచ్చిబౌలి ఫ్లైఓవర్, మెహదీపట్నం నుంచి మీదుగా మళ్లిస్తారు.
ఫుల్‌ మారథాన్ రూట్ – 42 కి.మీ, హాఫ్ మారథాన్ 21 కి.మీ, 10 కి.మీటర్ల మారథాన్ జరుగనుంది.