Tamil Nadu : రోడ్డు ప్రమాద బాధితులకు తొలి 48 గంటలు ఉచిత చికిత్స

ప్రమాదం జరిగిన మొదటి 48 గంటల్లో ఒక ప్రాణాన్ని కాపాడేందుకు అవసరమైన వైద్య ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు.

Tamil Nadu : రోడ్డు ప్రమాద బాధితులకు తొలి 48 గంటలు ఉచిత చికిత్స

Cm Stalin

Chief Minister MK Stalin : దేశంలో ఎక్కడో ఒకచోట ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మరికొంతమంది ఆసుపత్రికి తరలించేలోపు చనిపోతున్నారు. వారి ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా…తమిళనాడు సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురయ్యే వారిని వెంటనే రక్షించాలనే ఉద్దేశ్యంతో ఇన్నుయిర్ కాప్పోమ్ (ప్రాణాలను కాపాడుదాం) పేరిట కొత్త పథకం తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసింది. ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను రక్షించేలా ఇన్నుయిర్ కాప్పోమ్..నమైకాక్కుమ్ – 48 పథకం అందుబాటులోకి తెచ్చారు.

Read More : Bigg Boss 5 : మన రిలేషన్‌షిప్ బిగ్‌బాస్ వరకే.. షణ్నుకి గుర్తుచేసిన సిరి

ప్రమాదం జరిగిన మొదటి 48 గంటల్లో ఒక ప్రాణాన్ని కాపాడేందుకు అవసరమైన వైద్య ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి 48 గంటలు కీలకమని భావించి..ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. చెంగల్ పట్టు జిల్లా మేల్ మరువత్తూర్ లోని ఆదిపరాశక్తి వైద్య కళాశాలలో సీఎం స్టాలిన్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బాధితులకు చికిత్స అందించేందుకు 201 ప్రభుత్వ ఆసుపత్రులు, 408 ప్రైవేటు ఆసుపత్రులతో సహా…610 ఆసుపత్రులను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా రోడ్డు ప్రమాదానికి గురైతే…పథకంలో భాగంగా..తొలి 48 గంటల పాటు ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Read More : Punjab Amritsar : స్వర్ణ దేవాలయంలో యువకుడు వీరంగం..కొట్టి చంపిన భక్తులు

ఇక సీఎం స్టాలిన్ విషయానికి వస్తే..అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వినూత్న, విలక్షణమైన నిర్ణయాలు తీసుకుంటూ..ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణ వ్యక్తిలా…ప్రతిచోట అకస్మిక పర్యటనలు చేయడం, ప్రజల్లోనే ఉంటూ…వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.