IND vs AUS 3rd Test Match: అమ్మో.. స్వీప్ షాట్లొద్దు..! మూడో టెస్ట్‌లో రూటు మార్చనున్న ఆసీస్ ఆటగాళ్లు

మూడో టెస్టుకు వేదిక అయిన హోల్కర్ స్టేడియం (ఇండోర్)లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కు మెరుగైన రికార్డు ఉంది. ఈ పరిస్థితుల్లో అశ్విన్ బంతుల్ని స్వీప్ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తే అసలుకే మోసం వస్తుందని, అందుకే సాంప్రదాయ షాట్లకే ప్రయత్నించాలని స్టీవ్ స్మిత్, ఇతర ఆసీస్ బ్యాటర్లు భావిస్తున్నట్లు సమాచారం.

IND vs AUS 3rd Test Match: అమ్మో.. స్వీప్ షాట్లొద్దు..! మూడో టెస్ట్‌లో రూటు మార్చనున్న ఆసీస్ ఆటగాళ్లు

India vs Australia Test Match

IND vs AUS 3rd Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆసీస్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఇండియాలో జరుగుతుంది. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు పూర్తికాగా.. రెండింటిలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. మొదటి టెస్టులో స్పిన్నర్లు అశ్విన్, జడేజా ధ్వయం విజృంభణతో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. దీంతో మూడు రోజుల్లోనే టీమిండియా మ్యాచ్‌ను ముగించేసింది. రెండో టెస్టులో భారత్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు పకడ్బంధీ వ్యూహాన్ని అమలు చేసింది. కానీ, ఆసీస్ ప్లాన్ బెడిసికొట్టడంతో బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలిపోయింది. ఫలితంగా రెండో టెస్టులోనూ టీమిండియా మూడు రోజుల్లోనే విజయం సాధించింది.

India vs Australia 3rd Test: ఆస్ట్రేలియాకు ఊరట.. మూడో టెస్టుకు ఆల్‌రౌండర్ వచ్చేస్తున్నాడు ..

రెండో టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు స్వీప్ షాట్లతో భారత్ స్పిన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోవాలని భావించారు. కానీ, ఆ షాట్ల వల్లే ఆరుగురు ఆసీస్ బ్యాటర్లు ఔట్ కావటంతో వారి వ్యూహం బెడిసికొట్టినట్లయింది. రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లు అనూహ్యంగా కుప్పకూలడానికి స్వీప్ షాట్లే ప్రధాన కారణం. దీంతో మార్చి 1న ఇండోర్‌లో జరిగే మూడో టెస్టు మ్యాచ్‌లో స్వీప్ షాట్లు, రివర్స్ షాట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో స్వీప్, రివర్స్ షాట్ల వల్ల ఆరుగురు ఆసీస్ బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ బాటపట్టడంతో మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీంతో మూడో టెస్టులో కంగారూ ఆటగాళ్లు రూట్ మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

KL Rahul: కేఎల్ రాహుల్ ఆటతీరుపై మరోసారి మీమ్స్ వెల్లువ

మూడో టెస్టుకు వేదిక అయిన హోల్కర్ స్టేడియం (ఇండోర్)లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కు మెరుగైన రికార్డు ఉంది. ఈ పరిస్థితుల్లో అశ్విన్ బంతుల్ని స్వీప్ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తే అసలుకే మోసం వస్తుందని, అందుకే సాంప్రదాయ షాట్లకే ప్రయత్నించాలని స్టీవ్ స్మిత్, ఇతర ఆసీస్ బ్యాటర్లు భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి.. వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌లలో భారత్ స్పిన్నర్ల ధాటికి క్రీజులో ఎక్కువసేపు నిలవలేక పోయిన ఆసీస్ బ్యాటర్లు.. మూడో టెస్టులో వారిని ఎలా ఎదుర్కొంటారు..? ఏ వ్యూహంతో బరిలోకి దిగుతారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.