Vakeel Saab: టీవీల్లో వకీల్ సాబ్.. భారీ ఎత్తున ప్రమోషన్!

పవన్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ మేనియా ఇప్పటికీ తగ్గలేదు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ అంతరాయం కలిగించినా అప్పటికే రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ మేనరిజానికి తగ్గట్లు మలచిన తీరు అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. అసలే రెండేళ్లుగా ఆకలి మీదున్న పవన్ అభిమానులు వకీల్ సాబ్ కు బ్రహ్మరధం పట్టారు.

Vakeel Saab: టీవీల్లో వకీల్ సాబ్.. భారీ ఎత్తున ప్రమోషన్!

Vakeel Saab

Vakeel Saab: పవన్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ మేనియా ఇప్పటికీ తగ్గలేదు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ అంతరాయం కలిగించినా అప్పటికే రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ మేనరిజానికి తగ్గట్లు మలచిన తీరు అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. అసలే రెండేళ్లుగా ఆకలి మీదున్న పవన్ అభిమానులు వకీల్ సాబ్ కు బ్రహ్మరధం పట్టారు.

కరోనా లాక్ డౌన్ తో థియేటర్లకు దూరమైనా.. ఓటీటీలో కూడా ఆదరించి భారీ స్థాయి వ్యూస్ అందించారు. ఇక ఇప్పుడు.. వకీల్ సాబ్ టీవీల్లో కూడా రానున్నాడు. ఓ ప్రముఖ టీవీ నెట్ వర్క్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి కొనుగోలు చేయగా త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇందు కోసం సదరు సంస్థ భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేపడుతుంది. ఒకవైపు సోషల్ మీడియాలో భారీ ప్రమోషన్ చేస్తూనే ఆఫ్ లైన్ లో కూడా భారీగా ప్రమోట్ చేస్తుంది.

నిజానికి వకీల్ సాబ్ విడుదలైన సమయంలో ప్రమోషన్ మీద విమర్శలు వినిపించాయి. విడుదలకు ముందు సినిమా ప్రమోషన్ జరగలేదని అభిమానులు సోషల్ మీడియాలో భారీగా కామెంట్స్ చేశారు. అయితే.. సినిమా విడుదల తర్వాత ముమ్మరంగా ప్రమోషన్ చేశారు. ఓటీటీలో విడుదల సమయంలో కూడా ప్రమోషన్ పీక్స్ లో ఉండగా ఇక ఇప్పుడు టీవీల్లో వస్తున్నా భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు.

ఒకవైపు సోషల్ మీడియాలో యాడ్స్, అలర్ట్స్ వేస్తూనే.. వకీల్ సాబ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పై హైదరాబాద్ పరిసరాల్లో భారీ కటౌట్స్, పెయింటింగ్స్ తో ప్రమోట్ చేస్తున్నారు. టెలివిజన్ ప్రీమియర్ కే ఈ రేంజ్ లో అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. మరి ఇవన్నీ ఈ చిత్రానికి ఎంతమేర టీఆర్పీ ని రాబడతాయో చూడాలి.