Liger: మైక్ పట్టిన టైసన్.. లైగర్ తెచ్చిన టెన్షన్!
టాలీవుడ్‌లో బాహుబలి సిరీస్ తరువాత పాన్ ఇండియా చిత్రాల హవా ఎక్కువయ్యింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ చేసేందుకు.....

Liger: టాలీవుడ్‌లో బాహుబలి సిరీస్ తరువాత పాన్ ఇండియా చిత్రాల హవా ఎక్కువయ్యింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ చేసి అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌తో మరికొన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. వాటిలో క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న మూవీ లైగర్ కూడా ఒకటి.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసినప్పుడే ఈ కాంబోపై అందరి చూపు పడింది. అయితే పూరీ గతంలో ఎప్పుడూ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించకపోవడంతో, ఈ సినిమాను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడా అని అందరూ సందేహ పడ్డారు. కానీ ఈ సినిమా కోసం ఆయన తీసుకున్న స్టార్ క్యాస్టింగ్‌ని చూసి అందరూ అవాక్కయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేను సెలెక్ట్ చేశాడు పూరీ. ఇక వర్సటైల్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఎవరి ఊహలకు అందని విధంగా ఈ సినిమాలో లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌ను కూడా తీసుకున్నాడు పూరీ.
Liger: లైగర్ కోసం అలా మారుతున్న వింక్ గర్ల్..?
ఈ వార్తతో యావత్ ప్రపంచ దృష్టిని లైగర్ వైపుకు తిరిగేలా పూరీ చేశాడు. అసలు బాక్సింగ్ తప్ప మరొకటి తెలియని మైక్ టైసన్‌ను.. తొలిసారి ఓ ఇండియన్ మూవీలో తీసుకోవడం, అది కూడా లైగర్ కావడంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం రాబోతుందని పూరీ ముందుగానే అనౌన్స్ చేయడం.. ఈ సినిమాలో మైక్ టైసన్ చేరడంతో, ఇది ఖచ్చితంగా బాక్సింగ్ నేపథ్యంలో రాబోయే సినిమా అని అందరూ ఫిక్స్ అయ్యారు.
అనుకున్నట్లుగానే లైగర్ చిత్రాన్ని బాక్సింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మైక్ టైసన్ లాంటి లెజెండరీ బాక్సర్ ఎందుకు జాయిన్ అయ్యారు.. అంతగా ఆయన్ను ఇంప్రెస్ చేసిన కంటెంట్ ఈ సినిమాలో నిజంగా ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. బాక్సింగ్ ప్రపంచంలో ఎదురులేని ఛాంపియన్‌గా పేరున్న మైక్ టైసన్, లైగర్ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తారా అని ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Liger Team: పూరీ-చార్మీ.. ఎక్కడ చూసినా ఈ జంట హడావుడే!
ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ కావడంతో, ఇప్పుడు ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కానీ మైక్ టైసన్‌కు ఈ సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించిందో.. ఆయన పాత్ర ఈ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో.. అనే సందేహాలు కూడా కొందరిలో తలెత్తుతున్నాయి. అయితే పూరీ తన సినిమాల్లోని పాత్రలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అది విలన్ పాత్ర అయినా, హీరోకు సహాయం చేసే పాత్రలైనా.. వాటిని పూరీ ఎలివేట్ చేసే విధానం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.
ఉదాహరణకు.. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్రను పూరీ చూపించిన విధానం.. అలాగే పోకిరి సినిమాలో నాజర్ పాత్ర చివరివరకు ఒకలా ఉండి, ప్రీక్లైమాక్స్‌లో సినిమా కథను మొత్తం మలుపుతిప్పే పాత్రగా మార్చడం లాంటివి మనకు పూరీ సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండతో పూరీ తీసుకొస్తున్న లైగర్‌లో కూడా మైక్ టైసన్ పాత్ర దాదాపు ఇలాంటిదే అయ్యి ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Liger : మైక్ టైసన్‌తో రౌడీ స్టార్.. అమెరికాలో మొదలైన రచ్చ
ఇక తాజాగా మైక్ టైసన్ తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేయడంతో, ఈ సినిమాపై ఆయన ఎంత ఆసక్తిగా ఉన్నారో మనకు అర్థం అవుతుందని ప్రేక్షకులు అంటున్నారు. ఏదేమైనా తన సినిమాలకు తన క్యాస్టింగ్‌తోనే క్రేజ్‌ను తీసుకొచ్చే సత్తా ఉన్న దర్శకుడు పూరీ, ఈసారి లైగర్‌తో పాన్ ఇండియా సక్సెస్‌ను అందుకోవడం ఖాయమని అంటున్నారు అభిమానులు. మరి లైగర్ చిత్రంలో మైక్ టైసన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక తాజాగా టైసన్ మైక్ పట్టుకుని డబ్బింగ్ పూర్తి చేసిన ఫోటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. తనకు ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేయడంలో సహాయపడ్డ ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు మైక్ టైసన్. ఇక ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
The final bell has rung!🔔
The legend @MikeTyson has completed his dubbing for #Liger.#VaatLagaDenge pic.twitter.com/LTG9tOHVCV— Dharma Productions (@DharmaMovies) April 1, 2022
- Adivi Sesh : మేజర్ పై విజయ్ దేవరకొండ స్పెషల్ ట్వీట్..
- Pooja Hegde: జనగణమణ షూటింగ్ స్టార్ట్.. బుట్టబొమ్మతో మొదలుపెట్టన పూరీ
- Jana Gana Mana: ‘జనగణమన’కు ఇండియన్ డిఫెన్స్ ఝలక్..?
- Koffee with Karan : బాలీవుడ్ టాప్ షోలో విజయ్ దేవరకొండ
- Vijay Devarakonda : అనన్య, ఛార్మి మధ్యలో విజయ్.. ముంబైలో ఎంజాయ్ చేస్తున్న లైగర్ టీం..
1Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం
2Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
3Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
4Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
5Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
6Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
7Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
8Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
9Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
10New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?