Liger: లైగర్ కోసం అలా మారుతున్న వింక్ గర్ల్..?

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.....

Liger: లైగర్ కోసం అలా మారుతున్న వింక్ గర్ల్..?

Priya Prakash Varrier To Do Item Song In Liger Movie

Liger: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ పాత్రలో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తూ భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.

Liger Team: పూరీ-చార్మీ.. ఎక్కడ చూసినా ఈ జంట హడావుడే!

ఈ సినిమాలో వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ హాట్ స్పెషల్ సాంగ్‌లో విజయ్ సరసన చిందులేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రియా ప్రకాశ్ ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఇతర ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ నెట్టుకొస్తుంది. అయితే ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్రంలో ఓ మాస్ మసాలా సాంగ్‌లో నర్తించాల్సిందిగా ఆమెకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆఫర్‌ను వెంటనే ఆమె ఓకే చేసినట్లు చిత్ర వర్గాల్లో టాక్. అయితే దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Liger : భారీ ధరకు అమ్ముడైన ‘లైగర్’ డిజిటల్ రైట్స్

ఇక లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమాలో వరల్డ్ ఫేమస్ లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఓ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పూరీ మరియు ఛార్మీ కలిసి ప్రొడ్యూస్ చేస్తుండగా, బాలీవుడ్‌లో ఈ సినిమాను కరణ్ జోహర్ రిలీజ్ చేస్తున్నారు. మరి లైగర్ చిత్రంలో వింక్ గర్ల్ స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.